మహిళలు, పురుషులు ఎంతో ఇష్టపడే దుస్తులను కొనుగోలు చేసే మీషో యాప్ త్వరలోనే IPOకు రానుంది. ఉత్పత్తి దారులకు, కస్టమర్లకు మధ్య వారధిగా నిలిచే ఈ యాప్ అతి తక్కువ సమయంలోనే దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలను ఢీ కొట్టి పోటీలో నిలిచింది. 

మహిళలు ఎక్కువగా ఇష్టపడే మీషో (Meesho) యాప్ అతి త్వరలోనే ఐపీవో(IPO)కు రానుంది.  ఈ స్టార్టప్ కంపెనీ ఇష్యూ నుంచి నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీకి Facebook మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్‌లు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్  విజన్ ఫండ్ నుంచి గతంలో నిధులు సమకూరాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, మీషో (Meesho) యొక్క IPO 2023 ప్రారంభంలో రావచ్చు.

రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ బెంగళూరు ఆధారిత సోషల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ 2022 చివరిలో లేదా 2023 ప్రారంభంలో లిస్టింగ్ కు వచ్చే అవకాశం ఉంది.  కంపెనీ భారతీయ, యుఎస్ మార్కెట్‌లలో లిస్టింగ్ చేసే అవకాశాలను అన్వేషిస్తోంది.

ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో, మీషో (Meesho) సిరీస్ F ఫండింగ్ రౌండ్‌లో 57 మిలియన్లను సేకరించింది. కంపెనీ విలువ 4.9 బిలియన్ల గా ఉన్నట్లు సమాచారం. ఫిడిలిటీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ కంపెనీ, బి క్యాపిటల్ గ్రూప్ నేతృత్వంలోని మీషో (Meesho)సంస్థ అభివృద్ధి కోసం ఈ నిధులను సేకరించింది.

కంపెనీ చేసే పని ఏంటి..? 
వినియోగదారులు తమ లాభాల మార్జిన్‌లను తీసుకొని సరఫరాదారుల మార్కెట్‌ప్లేస్‌ల నుండి కొనుగోలు చేయడం ద్వారా WhatsApp, Facebook,  Instagram ద్వారా ఉత్పత్తులను విక్రయించవచ్చు. "వచ్చే ఏడాది జనవరి నాటికి మీషో ఇష్యూ కోసం దరఖాస్తులను సమర్పించే అవకాశం ఉంది. కంపెనీ ఇష్యూ 2023 మధ్యలో వచ్చే అవకాశం ఉంది" అని మార్కెట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు ఐపీవో ద్వారా మార్కెట్లోకి వచ్చి నిధుల సమీకరణ చేపట్టాయి. 

ఇదిలా ఏంటూ మీషో JP మోర్గాన్ చేజ్‌లో మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అయిన ధీరేష్ బన్సాల్‌ను నవంబర్ 2021లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నియమించారు. స్టార్టప్‌కి సంబంధించి ఐపీఓకు ముందు సన్నద్ధ పరిచే బాధ్యతను బన్సాల్‌కు అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మీషో (Meesho)ను 2015లో ఐఐటీ గ్రాడ్యుయేట్లు విదిత్ ఆత్రేయి, సంజీవ్ బర్నాల్ ప్రారంభించారు. మీషో (Meesho) విక్రయదారులకు లాజిస్టిక్స్ సేవలను కూడా అందిస్తుంది. ఫేస్‌బుక్ జూన్ 2019లో మీషోలో పెట్టుబడి పెట్టింది. సిలికాన్ వ్యాలీ ఆధారిత టెక్ దిగ్గజం నుండి నిధులు పొందిన మొదటి భారతీయ స్టార్టప్ ఇది. ప్రోసస్ వెంచర్స్, సీక్వోయా క్యాపిటల్ కూడా కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి.