Asianet News TeluguAsianet News Telugu

టాంగా నుండి ప్రారంభమై వేల కోట్ల వ్యాపారంలోకి: మసాలా కింగ్, ఎండిహెచ్ యజమాని జీవిత చరిత్ర..

మహాశయ్ ధర్మపాల గులాటిని 'ఎండిహెచ్ అంకుల్', 'దాదాజీ', 'మసాలా కింగ్', 'కింగ్ ఆఫ్ స్పైసెస్' అని పిలిచేవారు. మహాశయ్ ధరంపాల్ గులాటి మసాలా బ్రాండ్ 'ఎండిహెచ్' (మహాసియా డి హట్టి) యజమాని ఇంకా సి‌ఈ‌ఓ.

masala king mahashay dharampal gulati news mahashay dharampal gulati passed away know all about his life
Author
Hyderabad, First Published Dec 3, 2020, 4:59 PM IST

భారత్‌తో సహా ప్రపంచ ప్రఖ్యాత పొందిన మసాలా బ్రాండ్ 'ఎమ్‌డిహెచ్' యజమాని 'మహాశయ్' ధరంపాల్ గులాటి గురువారం ఉదయం 98 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. మహాశయ్ ధర్మపాల గులాటిని 'ఎండిహెచ్ అంకుల్', 'దాదాజీ', 'మసాలా కింగ్', 'కింగ్ ఆఫ్ స్పైసెస్' అని పిలిచేవారు.

మహాశయ్ ధరంపాల్ గులాటి మసాలా బ్రాండ్ 'ఎండిహెచ్' (మహాసియా డి హట్టి) యజమాని ఇంకా సి‌ఈ‌ఓ . కుటుంబ విభజన తరువాత పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన గులాటి, టాంగాతో జీవనోపాధిని ప్రారంభించాడు.

అయితే ఈ రోజు తన సంస్థ 1000 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తుంది.  పాకిస్తాన్‌లో జన్మించిన ప్రసిద్ధ ధరంపాల్ గులాటి  సియాల్‌కోట్‌లో నివసించేవారు. అతను బాల్యం మొత్తం పాకిస్తాన్ లోనే గడిచింది. 1919 లో సియాల్‌కోట్‌లో ధరంపాల్ గులాటి తండ్రి 'మహాసియా డి హట్టి' పేరుతో మసాలా దుకాణం ప్రప్రాంభించారు. అతని తండ్రి సుగంధ మసాలాలు అమ్మేవారు.

కుటుంబం విభజన తరువాత భారతదేశానికి వచ్చిన ధరంపాల్ గులాటి తన తండ్రి ఇచ్చిన డబ్బుతో టాంగాను కొనుగోలు చేశాడు. ప్రారంభంలో గులాటి కుటుంబం అమృత్సర్‌లో శరణార్థిగా నివసించారు. అ తరువాత ధరంపాల్ గులాటి ఢీల్లీకి మకాం మారారు.  

కరోల్ బాగ్‌(ఢీల్లీలో ఒక ప్రసిద్ధ మార్కెట్) లో చిన్న మసాలా దుకాణంతో  సుగంధ మసాలాలు అమ్మే తన కుటుంబ వ్యాపారాన్ని పున-ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అయితే నెమ్మదిగా వ్యాపారం మెరుగుపడుతుండటంతో లాభాలు పొందడం ప్రారంభించారు.

1953 లోనే  'మహాసియా డి హట్టి' (ఎన్‌డి‌హెచ్ ) పేరుతో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకుని సుగంధ మసాలాలు అమ్మడం ప్రారంభించాడు. ఈ తరువాత గులాటి ఎండిహెచ్ సంస్థను అధికారికంగా 1959లో స్థాపించారు. ఇందుకోసం కీర్తి నగర్‌లో భూమి కొని మసాలా తయారీ విభాగాన్ని ఏర్పాటు చేశాడు.

also read స్పైస్ బ్రాండ్ ఎండిహెచ్ మసాలా యజమాని 'మసాలా కింగ్' ధరంపాల్ గులాటి ఇకలేరు ...

దేశవ్యాప్తంగా 15 తయారీ కేంద్రాలు వృద్ధి చెందడమే కాకుండా గులాటి సుగంధ మసాలాలని పంపిణీదారి, ఎగుమతిదారిగా మారింది. ప్రస్తుతం ఎం‌డి‌హెచ్ సుగంధ మసాలాలు 50 రకాల మసాలాను తయారు చేస్తున్నని . అలాగే  ప్రపంచవ్యాప్తంగా ఎం‌డి‌హెచ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

ఈ రోజు వరకు యూ‌కే, యూరప్, యుఎఇ, కెనడా వంటి దేశాలతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎం‌డి‌హెచ్ మసాలాలు ఎగుమతి అవుతున్నాయి. గులాటి 2017 లో భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఎఫ్‌ఎంసిజి (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) సిఇఒగా అవతరించారు. 

 ఎండిహెచ్ కంపెనీ ఉత్తర భారతదేశంలో 80 శాతం మార్కెట్‌ను కలిగి పేర్కొంది. ధరంపాల్ గులాటి తన ఉత్పత్తులను స్వయంగా ప్రోమోట్ చేసేవాడు. అతను టీవీలో ఎం‌డి‌హెచ్ మసాలా గురించి చెప్పడం మీరు చూసే ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రజలు అతన్ని 'ఎండిహెచ్ అంకుల్' అని కూడా పిలుస్తారు. 

 ధర్మపాల గులాటి ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. తరువాత చదువును వొడిలేశాడు. ధరంపాల్ గులాటికి పెద్దగా పుస్తక పరిజ్ఞానం లేకపోవచ్చు, కాని పెద్ద వ్యాపారవేత్తలు అతన్ని వ్యాపార రంగంలో పోటీగా భావించేవారు.  

ధరంపాల్ గులాటి తన జీతంలో 90 శాతం విరాళంగా ఇచ్చేవారంటూ చెబుతున్నారు. సరసమైన ధరలకు విక్రయించే ఉత్పత్తి నాణ్యత గురించి నిజాయితీగా పనిచేయడానికి ప్రేరణ ఉందని, నా జీతంలో 90 శాతం స్వచ్ఛంద సంస్థకు వెళుతుందని ఆయన ఒక ఇంటర్వ్యూలో  చెప్పారు. 

మురికివాడలలో నివసించే వారి కోసం  250 పడకల ఆసుపత్రి, గులాటి తండ్రి పేరు మీద ఒక ఛారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. ఈ ట్రస్ట్ పేద పిల్లల కోసం నాలుగు పాఠశాలలను కూడా నడుపుతుంది. 2018లో ఆయన 25 కోట్ల రూపాయల జీతం చేతిలో అందుకున్నట్లు వర్గాలు తెలిపాయి.  

 ధరంపాల్ గులాటి అన్ని ప్రధాన వ్యాపార నిర్ణయాలు తానే స్వయంగా తీసుకునేవాడు. అతను తన సంస్థ ఉత్పత్తిలలో నిజాయితీ, నాణ్యమైన ఉత్పత్తులు, సరసమైన ధరల వంటి మూడు అంశాలను చాలా ముఖ్యమైనదిగా భావించాడు. గులాటికి సంస్థలో 80 శాతం వాటా ఉంది. అతను తన ఫ్యాక్టరీ, మార్కెట్‌ను క్రమం తప్పకుండా సందర్శించేవాడు. 

గత సంవత్సరం 2019లో అందుకున్న పద్మ భూషణ్ అవార్డు, పద్మ అవార్డులు పొందిన 112 మంది ప్రముఖులలో ధరంపాల్ గులాటి కూడా ఒకరు. వ్యాపారం, పరిశ్రమల కోసం చేసిన కృషికి ఆయనకు గత ఏడాది ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ పద్మ భూషణ్ అవార్డ్ ప్రదానం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios