Asianet News TeluguAsianet News Telugu

అదానీ వైపు వీస్తున్న అదృష్ట గాలి! ఆస్తులు మళ్లీ 100 బిలియన్ డాలర్ల మార్కు పైకి !

అదానీ గ్రూప్ సీఈఓ గౌతమ్ అదానీ $100 బిలియన్లకు పైగా ఆస్తులతో ధనికుల ఎలైట్ క్లబ్‌లోకి తిరిగి వచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ ఈ లిస్టులో  చేరాడు.
 

Lucky wind blowing in Adani's side! Assets crossed the $100 billion mark again!-sak
Author
First Published Feb 8, 2024, 10:49 PM IST

అదానీ గ్రూప్ సీఈఓ గౌతమ్ అదానీ $100 బిలియన్లకు పైగా ఆస్తులతో ధనికుల ఎలైట్ క్లబ్‌లోకి తిరిగి వచ్చారు. ఏడాది తర్వాత మళ్లీ ఈ లిస్టులో చేరడం విశేషం.

2023 ప్రారంభంలో స్వల్ప ఎదురుదెబ్బ తర్వాత, అదానీ కోల్పోయిన దాన్ని తిరిగి పొందారు. బుధవారం అదానీ నెట్ వాల్యూ  2.7 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం సంపద 100.7 బిలియన్ డాలర్లకు చేరింది.

హిండర్‌బర్గ్ నివేదికలో అదానీ గ్రూప్‌పై వచ్చిన స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ ఆరోపణలను అదానీ గ్రూప్ నిర్ద్వంద్వంగా ఖండించింది.

అదానీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేర్లు గత వారం 130% లాభాన్ని చూపించాయి. అయితే బుధవారం వరుసగా ఎనిమిదో రోజు స్టాక్‌లు లాభపడ్డాయి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ల లిస్ట్ ప్రకారం అదానీ ఇప్పుడు ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తి. మరో భారతీయ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తరువాత అదానీ ఉన్నారు. ఈ నెల ప్రారంభంలో ముకేశ్  అంబానీ సంపద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకోవడం కూడా గమనార్హం.

అయితే అదానీ ఆస్తులు 2022లో గరిష్ట స్థాయికి చేరిన దాని కంటే 50 బిలియన్ డాలర్లు తక్కువగా ఉన్నాయి. గతేడాది హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైన తర్వాత అదానీ ఆస్తులు ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయాయి. కోల్పోయిన మార్కెట్ విలువను తిరిగి పొందడానికి, పెట్టుబడిదారులను ఇంకా   రుణదాతలను తిరిగి గెలుచుకోవడానికి అండ్ రుణాన్ని తిరిగి చెల్లించడానికి నెలల సమయం పట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios