ఎన్నికలు ముగియడంతో... వంటగ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం అమాంతం పెంచేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి కొలువుదీరింది. కాగా... అలా అధికారంలోకి రాగానే... ఇలా వంట గ్యాస్ ధరలను పెంచేసింది. సవరించిన ధరలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. 

నెలవారీ ధరల సవరింపులో భాగంగా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (ఐవోసీ) 14.2 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.1.23 పైసలు పెంచింది.  అలాగే నాన్‌ సబ్సీడీ సిలిండర్‌ ధరను రూ. 25 పెంచింది. 

అయితే విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ ధరను ప్రభుత్వం తగ్గించింది. సబ్సిడీ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1.23 పైసలు పెరిగింది. రాయితీలేని సిలిండర్ ధర రూ.25 పెరిగింది. సబ్సిడీదారులు సిలిండర్ ధరను చెల్లించిన తర్వాత సబ్సిడీ అమౌంట్ వారి అకౌంట్లో జమ అవుతాయి.  కాగా ఎల్‌పీజీ ధర పెరగడం వరుసగా ఇది నాలుగోసారి.