LPG price hike: బడ్జెట్ రోజున షాక్..పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
LPG price hike: లోక్ సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ 2024-2025 ఓట్ ఆన్ అకౌంట్ కాబోతోంది. అయితే, బడ్జెడ్ రోజు ప్రజలకు షాక్ తగిలింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి.
Increased LPG cylinder prices: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, బడ్జెట్ రోజున ప్రజలకు బిగ్ షాక్ తగిలింది. 2024 బడ్జెట్ సమర్పణకు ముందు దేశంలో సామాన్యులకు షాకిస్తూ.. ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) గురువారం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను తక్షణమే అమలులోకి వచ్చేలా రూ.14 పెంచాయి. మధ్యంతర బడ్జెట్ 2024-25 సమర్పించడానికి కొన్ని గంటల ముందు ఈ ధరల పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం.
చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) గురువారం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా సమాచారం ప్రకారం 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ .14 పెరిగింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుండి అమలులోకి వస్తాయి. తాజా ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకపు ధర ఇప్పుడు రూ.1,769.50 చేరుకుంది.
మార్కెట్ కు అనుగుణంగా ప్రతినెలా చమురు కంపెనీలు తమ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాణిజ్య, గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు పెంచాయి. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. గత నెల ప్రారంభంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు న్యూఢిల్లీ, ముంబై, చెన్నైలలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను సవరించాయి.
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సవరించిన ధరలు ఇలా ఉన్నాయి
హైదరాబాద్ - రూ. 2002.00
ఢిల్లీ - రూ. 1,763.50
ముంబై - రూ.1,723.50
కోల్‌కతా - రూ.1,887.00
చెన్నై -రూ.1,937.00
ఇక గృహవసరాలకు ఉపయోగించే నాన్ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌పై రూ.903గా ఉంది.
బడ్జెట్ గురించి మీకు తెలియని టాప్ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవి