LIC IPO Listing: అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ (Life Insurance Corporation listing) ఇష్యూ ధర కన్నా 9 శాతం డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC Listing) షేర్ల లిస్టింగ్ జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్ (Life Insurance Corporation listing) ఇష్యూ ధర కన్నా 9 శాతం డిస్కౌంట్ తో లిస్ట్ అయ్యింది. దీంతో షేర్లు అలాట్ అయిన ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. మదుపరులు లిస్టింగ్ లాభాలను పొందలేకపోయారు. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో ఎన్ఎస్ఈలో ప్రీ మార్కెట్ ఓపెనింగ్ నుంచే డిస్కౌంట్ ట్రేడింగ్ తో ఎల్ఐసీ డిజాస్టర్ వైపు పయనిస్తున్న సూచనలు కనిపించాయి. LIC షేర్లు రూ. 865 ధర వద్ద లిస్ట్ అయ్యాయి. నిజానికి ఇష్యూ ధర గరిష్టంగా రూ. 949గా నిర్ణయించారు.
LIC IPO నుండి ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు సమీకరించింది
ఈ IPO నుండి రూ. 20,557 కోట్లను సేకరించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. అయితే ఇన్వెస్టర్లు, పాలసీదారులు, ఉద్యోగస్తులు మంచి లిస్టింగ్ లాభాలను పొందుతారని భావివంచారు. కానీ మార్కెట్ లో లిస్టింగ్ లాభాలు నమోదు చేసుకోలేక పోయింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
అయితే భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, వారు ఎల్‌ఐసి షేర్లను మీడియం నుండి దీర్ఘకాలికంగా కలిగి ఉండాలని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
949 ఇష్యూ ధర
ఎల్‌ఐసీ షేర్ల ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.949గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎల్‌ఐసి పాలసీదారులు మరియు రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్కో షేరుకు వరుసగా రూ.889 , రూ.904 చొప్పున డిస్కౌంట్ తో షేర్లను పొందారు.
IPO ప్రత్యేకత ఇదే...
ఎల్‌ఐసీ ఐపీఓ మే 9న ముగియగా, మే 12న బిడ్డర్లకు షేర్లను కేటాయించారు. ప్రభుత్వం IPO ద్వారా LICలో 22.13 కోట్లకు పైగా షేర్లను అంటే 3.5 శాతం వాటాను ఆఫర్ చేసింది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.902-949గా ఉంచింది.
