Asianet News TeluguAsianet News Telugu

హిండెన్ బర్గ్ నివేదికపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం, అదానీ గ్రూపు వెల్లడి, ఆ నివేదికను ఖండిస్తున్నామని ప్రకటన

హిండెన్‌బర్గ్ నివేదికపై అదానీ గ్రూప్ మండిపడింది. అదానీ గ్రూప్ నివేదిక తప్పు అని పేర్కొంది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తమను సంప్రదించకుండా లేదా వాస్తవాలను ధృవీకరించే ప్రయత్నం చేయకుండానే జనవరి 24న నివేదికను విడుదల చేసిందని అదానీ గ్రూప్ ఆరోపించింది.

Legal action will be taken against the Hindenburg report, Adani Group said in a statement denying the report MKA
Author
First Published Jan 27, 2023, 2:19 AM IST

అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్లు వాస్తవ విలువ కన్నా కూడా అధిక విలువను కలిగి ఉన్నాయని పేర్కొంది. నివేదిక ప్రకారం, వివిధ అదానీ గ్రూప్ కంపెనీల పనితీరు తక్కువగా ఉన్నప్పటికీ, అమాంతంగా షేర్ల ధరలు పెరిగాయి. అదానీ గ్రూప్ షేర్లు దాదాపు 85 శాతం ప్రీమియంతో ట్రేడవుతున్నాయని నివేదిక పేర్కొంది. 

ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ భారతదేశంలోనే అతిపెద్ద FPOని నిర్వహించనుంది. రాబోయే ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌ను నిరోధించడమే ఈ నివేదిక వెనుక ఉన్న ప్రధాన లక్ష్యంగా ఉందని అదానీ గ్రూపు ఆరోపిస్తోంది. ఆర్థిక నిపుణులు, ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రూపొందించిన వివరణాత్మక విశ్లేషణలు నివేదికల ఆధారంగా పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ అదానీ గ్రూప్‌పై విశ్వాసం కలిగిఉంటారని" అని అదానీ గ్రూప్ గ్రూప్ CFO జుగేషీందర్ సింగ్ అన్నారు.

అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ రెండేళ్ల విచారణ అనంతరం అదానీ కంపెనీలపై తన నివేదికను మంగళవారం విడుదల చేసింది. దీని తర్వాత కంపెనీ రూ.46,000 కోట్ల మార్కెట్ క్యాప్ క్షీణతను ఎదుర్కొంది.. హిండెన్‌బర్గ్ తన తప్పుదారి పట్టించే నివేదికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదానీ గ్రూప్ తెలిపింది. 

హిండెన్‌బర్గ్ నివేదిక పబ్లిక్‌గా మారిన తర్వాత, అదానీ గ్రూప్ షేర్లు క్షీణించాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్లు బీఎస్‌ఈలో 8.87 శాతం క్షీణించి రూ.2,511.75 వద్ద ముగిసింది. అంతేకాకుండా అదానీ పోర్ట్-సెజ్ షేర్లు 6.30 శాతం క్షీణించి రూ.712.90కి చేరాయి. అదానీ టోటల్ గ్యాస్ షేరు 5.59 శాతం క్షీణించి రూ.3,668.15 వద్ద ముగిసింది. అదానీ విల్‌మార్‌ రూ. 544.50 వద్ద, అదానీ పవర్‌ రూ. 261.10 వద్ద ఐదు శాతం పతనంతో ముగిశాయి.

నివేదికకు సంబంధించిన వార్తల తర్వాత, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 3.04 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో గ్రూప్‌లోని ప్రముఖ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 1.54 శాతం క్షీణించాయి. అదానీ గ్రూప్ ఇటీవల కొనుగోలు చేసిన అంబుజా సిమెంట్స్, ఏసీసీ షేర్లు కూడా బీఎస్ఈలో దాదాపు ఏడు శాతం క్షీణించాయి. అదే సమయంలో, గ్రూప్ మీడియా సంస్థ న్యూఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డిటివి) షేర్లు ఐదు శాతం క్షీణించాయి. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో ముప్పై షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ ఇండెక్స్ 773.69 పాయింట్లు పడిపోయి 60,205.06 పాయింట్ల వద్ద ముగిసింది.

దీనిపై జేపీసీ, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ డిమాండ్ చేశారు. అమెరికన్ ఏజెన్సీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలను "కఠినమైన" మార్కెట్ మానిప్యులేషన్ , అకౌంటింగ్ మోసానికి పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత ప్రతిపక్ష నాయకులు కూడా గొంతు విప్పారు. నివేదికను ప్రచురించిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో పాటు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారించాలని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios