Twitter: ట్విట్టర్ కు కర్ణాటక హైకోర్టులో ఎదురు దెబ్బ, కేంద్ర ఆదేశాలు పాటించనందుకు రూ. 50 లక్షలు జరిమానా..
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం కోర్టు.. ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటించనందుకు 50 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ కు కర్ణాటక హైకోర్టు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలపై ట్విట్టర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించడమే కాకుండా కంపెనీకి రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది. గత ఏడాది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తనకు జారీ చేసిన ఉత్తర్వులను ట్విట్టర్ సవాలు చేసింది.
గత ఏడాది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) జారీ చేసిన ఉత్తర్వులను ట్విట్టర్ సవాలు చేసింది. ఫిబ్రవరి 2021 - ఫిబ్రవరి 2022 మధ్య అనేక సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను స్తంభింపజేయాలని కేంద్రం ట్విట్టర్‌ని కోరింది. వీటిలో 39 బ్లాకింగ్ ఆర్డర్‌లను ట్విట్టర్ సవాలు చేసింది.
2022లో, కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) నిబంధనల ప్రకారం తన ప్లాట్‌ఫారమ్ నుండి కంటెంట్‌ను తీసివేయాలన్న కేంద్రం ఆదేశాలను సవాలు చేస్తూ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. 2022లో పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఖాతాను బ్లాక్ చేయడానికి గల కారణాలను కేంద్రం జారీ చేసిన ఆర్డర్‌లో జాబితా చేయాలని ట్విట్టర్ హైకోర్టుకు తెలిపింది. అవసరమైతే ఆర్డర్ (IT చట్టం, 2000లోని సెక్షన్ 69A కింద జారీ చేయబడింది) సవాలు చేయబడే విధంగా ఒక నియమావళిని ఏర్పాటు చేయాలని కంపెనీ పట్టుబట్టింది.
ఇదిలావుండగా, బ్లాకింగ్ ఆర్డర్ జారీ చేయడానికి ముందు ప్రభుత్వం, ట్విట్టర్ ప్రతినిధుల మధ్య సుమారు 50 సమావేశాలు జరిగాయని భారత ప్రభుత్వం తెలిపింది. దేశంలోని చట్టాలను పాకర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం కోర్టు.. ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వ సూచనలను పాటించనందుకు 50 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొంది. టించకూడదనే ఉద్దేశ్యం ట్విట్టర్‌కు ఉందని కూడా కేంద్రం కోర్టుకు తెలిపింది.