ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్..వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకి విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 50శాతం దాకా డిస్కౌంట్స్ అందిస్తోంది. దాదాపు సగం ధరకే టికెట్లను ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఈ నెల 25వ తేదీ వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి. ప్రీమియం, ఎకానమి క్లాస్ సీట్లకు కూడా ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులు ఈ ణెల 21 నుంచి దేశీయ ప్రయాణికులు మార్చి 1 నుంచి ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా ప్రయాణానికి ఎనిమిది రోజుల ముందు కచ్చితంగా టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని  స్పష్టం చేసింది.