ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే  బ్లూస్కై అనే కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ కొత్త 'BlueSky' యాప్ యాండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. దీంతో ట్విట్టర్ కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. 

ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే తాను సృష్టించి ఎలాన్ మస్క్ కు విక్రయించిన ట్విట్టర్‌కు పోటీగా బ్లూ స్కై అనే యాప్‌ను విడుదల చేశారు. నవంబర్ 2021లో జాక్ డోర్సే ట్విట్టర్ CEO పదవికి రాజీనామా చేసినప్పటికీ నుంచి ఆయన మరో యాప్ సృష్టించాలని కృత నిశ్చయంతో ఉన్నారు.. 

జాక్ బ్లూ స్కైని ప్రారంభించడం ద్వారా, ట్విట్టర్‌కు గట్టి ఛాలెంజ్ ఇవ్వచ్చని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం, ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉండగా, Apple యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ బ్లూ స్కై యాప్ యాండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తేనుంది. తద్వారా త్వరలోనే కంపెనీ ప్రజలందరికీ దీనిని అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ యొక్క ఇంటర్‌ఫేస్ పూర్తిగా Twitter లాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. 

బ్లూ స్కై ఇంటెలిజెన్స్ సంస్థ ఫిబ్రవరి 17న ప్రారంభం అయ్యింది. బ్లూస్కై యాప్ ఫిబ్రవరి 17 నుండి 2,000 స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసి, ట్రయల్స్ నిర్వహించారు. మీడియా నివేదికల ప్రకారం, ఈ కొత్త అప్లికేషన్ ట్విట్టర్ లాగా పని చేయనుంది. బ్లూస్కై యాప్ 256 అక్షరాల పరిమితితో మీ పోస్ట్ లను రాయడానికి అనుమతిస్తుంది. యాప్‌లో ఫోటో, బ్యాక్‌గ్రౌండ్ ప్రొఫైల్, బయో , వంటి ప్రొఫైల్ వివరాలు, అలాగే ఫాలో, షేర్, డేట్స్ ఫీడ్, మ్యూట్, బ్లాక్ అకౌంట్ వంటి ఆప్షన్‌లు ఉన్నాయి, అయితే ప్రారంభంలో బ్లూస్కై ఇప్పుడు ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే అందుబాటులో ఉంచింది. 

నిజానికి జాక్ డార్సీ గత ఏడాది నవంబర్‌లో ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి రాజీనామా చేశారు. తర్వాత భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సీఈవోగా ఎంపిక చేశారు. పరాగ్ అగర్వాల్ ట్విటర్ CEOగా ఒక సంవత్సరం పూర్తి కాకముందే, ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేశారు. ట్విట్టర్ సీఈఓగా ఎలోన్ మస్క్ బాధ్యతలు స్వీకరించిన మూడు రోజుల తర్వాత, జాక్ డోర్సే బ్లూస్కీ అనే కొత్త సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ను ప్రారంభించడం విశేషం.

ఇప్పుడు ఈ కొత్త 'BlueSky' యాప్ పూర్తిగా డెవలప్ చేసి, త్వరలో పబ్లిక్ రిలీజ్‌కి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. జాక్ డోర్సీ 2019లో 'బ్లూస్కై' అనే కంపెనీని రిజిస్టర్ చేసుకున్నారు. కొత్త కంపెనీ 'బ్లూస్కై ' సోషల్ మీడియా అప్లికేషన్‌పై పనిచేస్తున్న్లు గత ఏడాది చివర్లో ప్రకటించడం విశేషం. .ఇప్పుడు జాక్ డోర్సే ప్రారంభించిన బ్లూస్కై ఒక ప్రత్యేకమైన కంపెనీగా రూపుదిద్దుకుంది. గతేడాది బ్లూస్కీకి 13 మిలియన్ డాలర్ల విరాళాలు దక్కడం విశేషం. ట్విట్టర్‌లో పనిచేసిన చాలా మంది వ్యక్తులు బ్లూస్కై ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. దీన్ని బట్టి సోషల్ మీడియా రంగంలో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా బ్లూస్కై గట్టి పోటీ ఇస్తుందని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.