2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడానికి 31వ తేదీ చివరి తేదీ. ఈ తేదీకి మించి పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చివరి నిమిషంలో హడావుడిగా ID రిటర్న్‌ను ఫైల్ చేసే బదులు, ఆన్‌లైన్‌లో సులభంగా ఫైల్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయం ఆసన్నమైంది. 2022-23 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఆదాయపు పన్ను రిటర్న్‌ల చివరితేదీ గడువును ప్రతి సంవత్సరం పొడిగిస్తున్నందున, ఈ సంవత్సరం కూడా పొడిగించవచ్చని అలక్ష్యం చేయకండి. అయితే కేవలం ఓ 15 నిమిషాలు కేటాయిస్తే చాలు మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే ITR దాఖలు ఎలా దాఖలు చేయాలో తెలుసుకుందాం. 

1. ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ eportal.incometax.gov.in/iec/foservices/#/login. ద్వారా తప్పనిసరిగా లాగిన్ అవ్వాలి. 

2. కొనసాగించడానికి మీ ప్యాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా వినియోగదారు IDని పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత పాస్‌వర్డ్‌ను పూరించండి.

3. మీరు పాత పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, మీరు కొత్త పాస్‌వర్డ్‌ని పొందవచ్చు. 

4. ఇ-ఫైలింగ్ ఎంపికపై క్లిక్ చేయండి.

5. ఫైన్ ఇన్ కమ్ ట్యాక్స్ బటన్ పై క్లిక్ చేయండి.

6. 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఫైల్‌ని ఎంచుకుని, దానిపై క్లిక్ చేయండి.

7. ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడాన్ని ఎంచుకోండి. వ్యక్తిగతంగా దాఖలు చేయడాన్ని పేర్కొనండి.

8. మీరు ఏ ప్రాతిపదికన ఫైల్ చేయబోతున్నారో ఆ ప్రాతిపదికన ITR-1 లేదా ITR-4పై క్లిక్ చేయండి. నెలవారీ జీతం ఉంటే ITR-1పై క్లిక్ చేయండి. 

9. ఫైల్ రకాన్ని పేర్కొనండి. 139(1)ని ఎంచుకోండి. 

10. ఒరిజినల్ రిటర్న్‌లో పేర్కొన్న అన్ని వివరాలను తర్వాత బ్యాంక్ ఖాతా వివరాలను పేర్కొనండి.

11. ఆన్‌లైన్ వెరిఫికేషన్ మోడ్‌కి వెళ్లి, అటాచ్ ఆప్షన్‌లో మనం ఫైల్ చేయాల్సిన అప్లికేషన్‌ను అటాచ్ చేయండి. 

12. వెరిఫికేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత, తదుపరి కొన్ని సెకన్లలో రిటర్న్ ఫైల్ జనరేట్ అవుతుంది.