రైలు ప్రయాణిలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా టికెట్లను మరింత సులభంగా బుక్ చేసుకోవచ్చు. దీని కోసం కొత్త వెబ్‌సైట్ సిద్ధం చేసింది. కేవలం ఒక్క నిమిషంలోనే ఈ వెబ్‌సైట్ నుండి పది వేల ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం నిమిషానికి 7500 టికెట్లు బుక్ అవుతున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఈ కొత్త వెబ్‌సైట్‌ను నేడు ప్రారంభించనున్నారు. 

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) వెబ్‌సైట్ అలాగే యాప్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ప్రయాణీకులు పాత వెర్షన్ కంటే వేగంగా టికెట్లు బుక్ చేసుకోగలుగుతారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

also read  ఇండియాలోకి కొత్త రకం కరోనా వైరస్.. ముందుజాగ్రతగా జనవరి 7 వరకు ఆ విమానాలపై నిషేధం.. ...

ఆహారం, పానీయలతో సహా ఇతర సౌకర్యాలు కూడా ఈ వెబ్‌సైట్ లో చేర్చబడ్డాయి.  ప్రయాణ టికెట్లతో పాటు నచ్చిన ఆహారం, పానీయలను బుక్ చేసుకోవచ్చు.

ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ అప్‌గ్రేడ్ చేయడంతో టికెట్ బుకింగ్ వేగం పెరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ వెబ్‌సైట్ నుండి ఇష్టమైన ఆహారాన్ని కూడా బుక్ చేసుకోవచ్చు.

టికెట్ బుకింగ్ ప్రారంభంలో వెబ్‌సైట్ నెమ్మదిగా ఉండేది. దీని కారణంగా టికెట్ బుకింగ్ లో సమస్యలు ఎదురయ్యేవి. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేయడానికి ఈ చర్య తీసుకున్నారు.  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా దిశా చాట్‌బట్ తో ప్రత్యేక సౌకర్యం తీసుకొచ్చారు. ఇందులో ప్రయాణికులకు రైలు క్యాసులేషన్, టికెట్ బుకింగ్, క్యాటరింగ్ వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి. 

వెబ్‌సైట్‌లో కొత్త పోస్ట్ పెయిడ్ పేమెంట్ ఆప్షన్ కూడా ఐఆర్‌సిటిసి అందిస్తుంది. రిజర్వ్డ్, తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవడానికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది.