iQoo Z10 Lite 5G: iQoo నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రిలీజ్ అయ్యింది. Z10 Lite 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ కేవలం రూ.10 వేల లోపే లభిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఉన్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా? 

iQoo Z10 Lite 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్, అమెజాన్ ఇండియా, iQOO mShop వెబ్‌సైట్లలో మాత్రమే కొనడానికి దొరుకుతుంది. బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌కి చెందిన ఈ ఫోన్ రూ.10,000 లోపే లభిస్తోంది. 

మార్కెట్ లోకి వచ్చిన iQoo Z10 Lite 5G ఫోన్

iQoo సంస్థ పలు టీజర్ల ద్వారా ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను ఇప్పటికే బయట పెట్టేసింది. ఈ ఫోన్ ఇప్పుడు రిలీజ్ కావడంతో ముఖ్యమైన ఫీచర్లను మరింత వివరంగా తెలుసుకుందాం. 

ఇందులో మిడ్‌రేంజ్ ప్రాసెసర్ అయిన MediaTek Dimensity 6300 SoC వాడారు. ఇది అధిక పనితీరు, తక్కువ శక్తిని వినియోగించే ప్రాసెసర్‌గా పేరుపొందింది. 

iQoo Z10 Lite 5G ఫోన్ బ్యాటరీ కెపాసిటీ ఎంతంటే?

ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉపయోగించారు. కంపెనీ ప్రకారం దీన్ని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌  చేస్తే 22.7 గంటల పాటు వీడియోలు చూడొచ్చు. 17.15 గంటల రీల్స్ స్క్రోలింగ్ చేస్తూ చూడొచ్చు. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఇది వినియోగదారుడు వాడే విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. కింద పడకుండా చూసుకోవడం, ఛార్జింగ్ పెట్టినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్యాటరీ లైఫ్ పెంచొచ్చు. 

iQoo Z10 Lite 5G ఫోన్ రెండు కలర్స్ లో లభిస్తుంది

iQoo Z10 Lite 5G ఫోన్ రెండు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది. సైబర్ గ్రీన్(Cyber Green), టైటానియం బ్యూ(Titanium Blue) కలర్స్ లో లభించే ఈ ఫోన్ యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. 

పైన ఉండే డ్యూయల్ కెమెరా సెటప్ "క్యాప్సూల్ మాడ్యూల్ డిజైన్"తో ఉంటుంది. కెమెరా పక్కన LED ఫ్లాష్ ఉంటుంది. ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.

iQoo Z10 Lite 5G ఫోన్ దుమ్ము నుంచి రక్షణ పొందుతుంది 

ఫోన్‌కి IP64 రేటింగ్ ఉంది. అంటే ఇది నీరు, ధూళి నుండి కొంతవరకు రక్షణ పొందుతుంది. ఇది కింద పడి పగిలిపోకుండా ఉండేలా మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ ఫీచర్‌ కూడా ఉంది. ఈ ఫీచర్ వల్ల ఈ ఫోన్ ని కాస్త రఫ్ గా వాడినా ఏమీ కాదు. అలా అని కింద పడేయకూడదు. పొరపాటున పడినా పగిలిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది.  

iQoo Z10 Lite 5G ఫోన్‌ స్టోరేజ్ కెపాసిటీ

iQOO Z10 Lite 5G వివిధ స్టోరేజ్ కెపాసిటీలతో లభిస్తుంది. 4GB RAM + 128GB కెపాసిటీ ఉన్న మోడల్ ధర రూ. 9,999. 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ అయితే రూ.10,999. 8GB RAM + 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.12,999గా నిర్ణయించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ AI కెమెరా ఉంది. ఈ కెమెరాతో తీసిన ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ నోయిజ్ తొలగించేందుకు AI Erase ఫీచర్, అలాగే బ్లర్ అయిన ఫోటోలను రీటచ్ చేయడానికి AI Enhance ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

iQoo Z10 Lite 5G ఫోన్‌ డిస్‌ప్లే ఎలా ఉందంటే.. 

iQoo Z10 Lite 5G ఫోన్‌ 1,000 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. అందువల్ల వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో కూడా స్క్రీన్‌ను సులభంగా చూడవచ్చు. iQoo Z10 Lite 5G ఫోన్, Android 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది తాజా ఫీచర్లను పొందాలనుకునే యూజర్లకు మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది.

iQoo Z10 Lite 5G ముఖ్య ఫీచర్లు

ప్రాసెసర్: MediaTek Dimensity 6300 SoC

బ్యాటరీ: 6000mAh, 22.7 గంటల వీడియో ప్లేబ్యాక్ సామర్థ్యం

డిస్‌ప్లే బ్రైట్‌నెస్: 1,000 నిట్స్

రామ్ & స్టోరేజ్: 8GB RAM, 256GB ఎక్స్పాండబుల్ స్టోరేజ్

కెమెరా: 50MP AI మెన్స్ కెమెరా, AI Erase, AI Enhance ఫీచర్లు

రంగులు: Cyber Green, Titanium Blue

డిజైన్: క్యాప్సూల్ మాడ్యూల్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్

OS: Android 15

రక్షణ: IP64 వాటర్ డస్ట్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రొటెక్షన్

ధర: రూ. 10,000 లోపు 

అమెజాన్, iQOO mShopలో కొనుక్కోండి

తక్కువ ధర, డిజైన్, స్పెసిఫికేషన్ల దృష్ట్యా బడ్జెట్ యూజర్ల కోసం iQoo Z10 Lite 5G ఫోన్ ను ప్రత్యేకంగా రూపొందించారు. ఇది ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ 5G ఫోన్ సెగ్మెంట్‌లో ఒక పెద్ద పోటీదారుగా నిలవనుంది. Amazon India, iQOO mShop ప్లాట్ ఫాంలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.