Asianet News TeluguAsianet News Telugu

ఎస్బీఐ వార్నింగ్: డిసెంబర్ 1 లోగా నెట్ బ్యాంకింగ్‌కు మొబైల్ నంబర్ నమోదు తప్పనిసరి!!

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నెట్‌ బ్యాంకింగ్‌కు మీ మొబైల్‌ ఫోన్ నంబర్ రిజిస్టర్‌ చేసుకోలేదా? ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ లోగా  మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేసుకోకుంటే మాత్రం మీ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ కానున్నది. 

Internet banking may not work for some SBI users from December 1
Author
Mumbai, First Published Oct 14, 2018, 11:33 AM IST

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) నెట్‌ బ్యాంకింగ్‌కు మీ మొబైల్‌ ఫోన్ నంబర్ రిజిస్టర్‌ చేసుకోలేదా? ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ లోగా  మీ మొబైల్ ఫోన్ నంబర్ నమోదు చేసుకోకుంటే మాత్రం మీ నెట్‌ బ్యాంకింగ్‌ బ్లాక్‌ కానున్నది. ఈ విషయమై ఎస్బీఐ వినియోగదారుల సౌకర్యార్థం తమ వెబ్‌సైట్‌లో ప్రకటన చేసింది.

‘ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్లు.. వెంటనే మీ మొబైల్‌ ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోండి.. లేదంటే ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మీ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు నిలిపివేయబడతాయి’ అని ఎస్‌బీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇచ్చిన గడువు లోపు మొబైల్‌ ఫోన్ నంబర్‌ను నమోదు చేసుకోవాలని సూచించింది.

గతేడాది జూలైలో బ్యాంకులకు ఇలా ఆర్బీఐ ఆదేశం
ఖాతాదారుల బ్యాంకింగ్‌ లావాదేవీల విషయమై ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా గతేడాది జూలై ఆరో తేదీన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) అన్ని బ్యాంకులకు సర్క్యులర్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్‌ ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాలని ఖాతాదారులకు సూచించింది. కనుక వెంటనే ఎస్బీఐ ఖాతాదారులు తమకు సమీపంలోని బ్యాంక్ శాఖకు వెళ్లి తమ మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఫోన్ నంబర్ నమోదు చేసుకున్న వినియోగదారులు కూడా తమ నంబర్ చెక్ చేసుకోవాలని వివరించింది. 

ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్‌లో మీ మొబైల్ నంబర్ నమోదు ఇలా
ముందు ఎస్బీఐ ఖాతాదారులు onlinesbi.com అనే ఎస్బీఐ నెట్‌ బ్యాంకింగ్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి.. లాగిన్‌, పాస్‌వర్డ్‌ వివరాలను నమోదు చేయాలి ఆ తర్వాత ‘మై అకౌంట్‌ అండ్‌ ప్రొఫైల్‌’ ట్యాబ్‌ను క్లిక్‌ చేయాలి. ‘ప్రొఫైల్‌’ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి. పర్సనల్‌ డిటైల్స్‌/మొబైల్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.

ఆ తర్వాత ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి(ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌, యూజర్‌ పాస్‌వర్డ్‌ వేర్వేరుగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది). ఒక్కసారి ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను విజయవంతంగా నమోదు చేసిన తర్వాత, రిజిస్ట్రర్‌ మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ (ముందే రిజిస్ట్రర్‌ అయి ఉంటే) డిస్‌ప్లే అవుతుంది.

కరెన్సీని ఆయుధీకరించబోమన్న ఐఎంఎఫ్‌ సభ్యదేశాలు
వాణిజ్య యుద్ధంలో కరెన్సీని ఆయుధంగా ఉపయోగించకూడదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) సభ్య దేశాలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ శనివారం తెలిపింది.

డాలర్‌కు వ్యతిరేకంగా యువాన్‌ విలువ తగ్గించడంపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్టీవ్‌ మ్నుచిన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తన ఎగుమతులను పెంచుకొనేందుకు ఇలా చేస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సభ్యదేశాలు తమ కరెన్సీ విలువను కృత్రిమంగా ప్రభావితం చేయకూడదని నిర్ణయించాయి.

యునాన్ విలువ పెంపుకే చైనా ఇలా చేస్తుందన్న అమెరికా
‘‘స్వేచ్ఛగా, ఆరోగ్యకరమైన పరస్పర లాభదాయక వ్యాపారం, పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి, ఉద్యోగ సృష్టికి కీలకమని భావిస్తున్నాం. పోటీపోటీగా కరెన్సీ విలువను తగ్గించడంలో జోక్యం చేసుకోకుండా స్వేచ్చగా కరెన్సీ మార్పిడిని జరిపించలేం ’’ అని ఇంటర్నేషనల్‌ మానిటరీ అండ్‌ ఫైనాన్షియల్‌ కమిటీ(ఐఎంఎఫ్‌సీ) పేర్కొంది.

ఇటీవల అమెరికా , చైనా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఒక్క డాలర్‌కు 7 యువాన్ల స్థాయికి చైనా కరెన్సీ పడిపోయింది. యువాన్‌ విలువను కృత్రిమంగా తగ్గించి ఎగుమతులు పెంచుకొనేందుకు చైనా ఈ విధంగా చేస్తోందని ఆమెరికా భావిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios