ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. తమ కంపెనీ సీనియర్ ఉద్యోగులకు శుభవార్త తెలియజేసింది. సాధారణంగా అయితే.. ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఉద్యోగులకు జీతాల పెంపు ఉంటుంది. అయితే ఇన్ఫోసిస్ మాత్రం ఎప్పటిలాగా కంటే ముందుగానే జీతాలు పెంచనున్నట్లు ప్రకటించింది. కాగా.. కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్ తో.. ఉద్యోగులు సంతోషంతో గెంతులేస్తున్నారు.

ఉద్యోగుల పనితీరును బట్టి.. వచ్చే ఏడాది జనవరి నుంచి సీనియర్ ఉద్యోగులకు 3శాతం నుంచి 5శాతం వరకు జీతం పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది. జీతం పెంచడంతోపాటు 170మంది సీనియర్లకు ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించింది. 

సాధారణంగా అయితే.. ఉద్యోగులకు మార్చి నుంచి జీతం పెంపు ఉంటుంది. సీనియర్లకు అయితే జులై నెల నుంచి ఇంక్రిమెంట్లు ఇచ్చి శాలరీస్ పెంచుతారు. కాగా.. ఈసారి మాత్రం భిన్నంగా జనవరి నుంచే శాలరీ పెంచనున్నట్లు ప్రకటించడం విశేషం.