Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ కంటే మించి ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ కుమార్తె ఆస్తులు.. భర్తపై విమర్శలు..

ది గార్డియన్ ప్రకారం, రిషి సునక్ అనేక మిలియన్ పౌండ్ల విలువైన భార్య ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడని, ఆమె ఆస్తులు ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ కంటే ధనవంతులురాలిగా  చేశాయని ప్రచురణలో తెలిపింది.

infosys  Narayan Murthys daughter Askhata richer than Queen Elizabeth II; husband faces criticism for hiding wealth
Author
Hyderabad, First Published Dec 5, 2020, 12:34 PM IST


 బ్రిటిష్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్, రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఆర్ధిక హోల్డింగ్స్‌ను వెల్లడించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె.

ది గార్డియన్ ప్రకారం, రిషి సునక్ అనేక మిలియన్ పౌండ్ల విలువైన భార్య ఆస్తులను వెల్లడించడంలో విఫలమయ్యాడని, ఆమె ఆస్తులు ఇంగ్లండ్ రాణి క్వీన్ ఎలిజబెత్ కంటే ధనవంతులురాలిగా  చేశాయని ప్రచురణలో తెలిపింది.

ఎన్ఆర్ నారాయణ మూర్తి టెక్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి జిబిపి 480 మిలియన్ల విలువైన వాటాలను కలిగి ఉంది, దీని విలువ సుమారు రూ.4,200 కోట్లు.  క్వీన్ ఎలిజబెత్ వ్యక్తిగత సంపద జిబిపి 350 మిలియన్లు, అంటే సుమారు రూ .3,400 కోట్లు.

యుకె చట్టం ప్రకారం ప్రతి మంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారి ఆర్థిక వివరాలు, దగ్గరి కుటుంబ సభ్యుల వివరాలను బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇది మంత్రులు తమ విధులను నిర్వర్తించేటప్పుడు సంఘర్షణ తలెత్తకుండా చూసేందుకు జరుగుతుంది.

తన భార్య ఆర్థిక ఆస్తులను వెల్లడించడంలో విఫలమైనందున సునక్ ఈ చట్టాన్ని పాటించలేదని ఆరోపించారు. ఈ విషయంపై ప్రారంభించిన దర్యాప్తులో రిషి సునాక్ ఆర్థిక నివేదికలలో అతని భార్య యు.కెకు చెందిన కాటమరాన్ వెంచర్స్ అనే చిన్న సంస్థకు యజమాని కూడా అని పేర్కొంది.

ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక ప్రకారం, అక్షతా మూర్తి గ్రూప్ లో 0.91% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం ఆ వాటా విలువ జి‌బి‌పి430మిలియన్లు. ప్రతి సంవత్సరం, ఆమె వాటాలు మిలియన్ల డివిడెండ్లకు అనుమతిస్తాయి. కుటుంబంలో ఆమె సోదరుడు రోహన్ మూర్తి మాత్రమే సంస్థలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నారు. కుటుంబ మొత్తం కలుపుకొని హోల్డింగ్ విలువ జి‌బి‌పి  1.7బిలియన్లు.

భారతదేశంలో అమెజాన్‌తో కలిసి జిబిపి 900మిలియన్ల-జాయింట్ వెంచర్‌తో సహా, నారాయణ మూర్తి, ఆమె కుటుంబం అనేక ఇతర ఆసలు కలిగి ఉన్నాయని గార్డియన్ పరిశోధనలో తేలింది.

ఈ విషయంపై దర్యాప్తు చేయమని యుకె ప్రభుత్వ ఎథిక్స్ వాచ్ డాగ్ కోసం ఇప్పటికే డిమాండ్లు ఉన్నాయి. బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంతర్గత సలహాదారులు రిషి సునాక్ ఆర్థిక విషయాల వెల్లడిపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు, అతను మంత్రివర్గ ప్రవర్తనా నియమావళిని సరిగ్గానే పాటించారని పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios