ఇన్ఫోసిస్‌కు సీఎఫ్‌వో రంగనాథ్‌ గుడ్‌బై: పూరించలేని లోటన్న మూర్తి

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 19, Aug 2018, 12:34 PM IST
Infosys CFO MD Ranganath makes surprise exit
Highlights

ముంబై: దేశీయ రెండో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ నుంచి మరో సీనియర్ అధికారి వైదొలిగారు. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) రంగనాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 18 ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న రంగనాథ్‌ ‘కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల’ దృష్ట్యా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబరు 16 వరకు రంగనాథ్‌ సీఎఫ్‌వో పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత కొత్త సీఎఫ్‌వో కోసం ఇన్ఫోసిస్‌ బోర్డు ఇప్పటికే వేట మొదలుపెట్టింది. సరిగ్గా ఏడాది క్రితమే ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కా సంస్థ వైదొలిగారు. ప్రస్తుత సంస్థ సీఈఓ సలీల్ పరీఖ్‌తోపాటు సంస్థల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సీఎఫ్ఓ రంగనాథ్ రాజీనామా చేస్తారన్న విషయం ఊహించలేదు.

గతంతో సీఎఫ్‌వోగా పనిచేసిన రాజీవ్‌ బన్సాల్‌ రాజీనామా చేయడంతో 2015లో రంగనాథ్‌ ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్ఫోసిస్‌లో 18ఏళ్ల విజయవంతమైన కెరీర్‌ తర్వాత కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల కోసం నేను సిద్ధమయ్యాను. గత మూడేళ్లలో కంపెనీకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా వాటిని అధిగమించి మేం ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని చెప్పేందుకు గర్వపడుతున్నా’ అని అన్నారు.

రంగనాథ్‌ రాజీనామాపై ఇన్ఫోసిస్‌ బోర్డు ఛైర్మన్‌ నందన్‌ నీలేకని స్పందించారు. ‘గత 18ఏళ్లలో రంగనాథ్‌ కంపెనీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. కంపెనీ విజయాల్లో భాగమయ్యారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయనలోని విస్తృత నాయకత్వ లక్షణాలను చూశాను’ అని నీలేకని అన్నారు.

ఇ‍న్ఫోసిస్‌ సిఎఫ్ఓ ఎండి రంగనాథ్‌ కంపెనీని వీడడంపై సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి విచారం వెలిబులిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో  ఉన్న ఇన్ఫీకి ఆయన నిష్క్రమణ పూరించలేని లోటని శనివారం వ్యాఖ్యానించారు. భారతదేశంలో అత్యుత్తమ  సీఎఫ్‌వోగా, అరుదైన వ్యక్తిగా రంగనాథ్‌ను అభివర్ణించిన మూర్తి, చట్టం, గవర్నెర్న్‌, ముఖ్యమైన ఖాతాదారులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, డెలివరీ టీమ్స్‌, ఉద్యోగి ఆకాంక్షలు, ఫైనాన్స్ లాంటి అన్నింటిని అవగాహన  చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. రంగనాథ్‌తో తాను15సంవత్సారాలు కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. 

గత ఐదేళ్లలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారని ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఛాలెంజింగ్‌ పరిస్థితులలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం, ధృఢమైన ఆర్థిక నైపుణ్యం, బలమైన విలువ వ్యవస్థ, మర్యాద, మన్ననతో గొప్ప లీడర్‌గా గుర్తింపు పొందిన రంగనాథ్ కంపెనీకి చాలా కీలకమని మూర్తి పేర్కొన్నారు.

loader