కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల విరామం తరువాత భారతదేశంలో మే 25న దేశీయ ప్యాసెంజర్ విమానాలను తిరిగి ప్రారంభించింది. కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించడంతో చాలా విమానాలు రద్దు చేయబడ్డాయి.

కరోనా యుగంలో ముఖ్యంగా  విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లాక్ డౌన్ కారణంగా విమానాలన ప్రయాణల కోసం బుక్ చేసుకున్నా టికెట్లను రాదు చేసింది, అయితే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రద్దు చేసిన టిక్కెట్లపై 'క్రెడిట్ షెల్'ను విమాన సంస్థలు సృష్టించారు.

ఇప్పుడు ఇండిగో రద్దు చేసిన విమానాల ప్రయాణికులందరికీ టికెట్ డబ్బును 31 జనవరి 2021 నాటికి తిరిగి ఇస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన కారణంగా ఈ సంవత్సరం ఇండిగో విమానాలు రద్దు చేయబడ్డాయి. రద్దు చేసిన టిక్కెట్లపై ఎయిర్ లైన్స్ 'క్రెడిట్ షెల్' ను సృష్టించింది.   

క్రెడిట్ షెల్ అంటే రద్దు చేసిన ప్రయాణికుడి టికెట్ ని భవిష్యత్ ప్రయాణాల కోసం టికెట్ బుక్ చేయడానికి ఉపయోగించవచ్చు. రద్దు చేసిన టికెట్లకు సంబంధించి సుమారు వెయ్యి కోట్ల రూపాయల వాపసుకు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు వైమానిక సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

also read వాహనదారులపై ఇంధన ధరల పిడుగు.. రెండేళ్ల గరిష్టానికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ...

ప్రయాణీకులకు తిరిగి చెల్లించే మొత్తంలో ఇది 90 శాతం. 100% క్రెడిట్ షెల్ చెల్లించబడుతుంది ఇండిగో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) రోంజోయి దత్తా మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా మార్చి చివరిలో ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. నగదు ప్రవాహం  స్తంభించిపోయినందున  మేము ప్రయాణీకుల డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాము.

ఇప్పుడు విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభించిన తరువాత విమాన ప్రయాణ డిమాండ్ క్రమంగా మెరుగుపడుతుంది, రద్దయిన విమానాలలో ప్రయాణీకుల టికెట్ డబ్బును తిరిగి ఇవ్వడమే మా ప్రాధాన్యత. మేము 31 జనవరి 2021 నాటికి 100% క్రెడిట్ షెల్ చెల్లిస్తాము" అని దత్తా చెప్పారు. 

విమానాలపై నిషేధం తరువాత విదేశాలలో చిక్కుకున్న ప్రయాణికులను తిరిగి తీసుకురావడానికి వందే భారత్ మిషన్ ప్రారంభించింది. ఇందుకోసం అనేక దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) భారతదేశానికి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య విమానాల ప్రయాణాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగించింది.

కానీ ఈ సమయంలో వందే భారత్ మిషన్ కింద ప్రయాణించే విమానాలు కొనసాగుతాయి. అంతకుముందు అంతర్జాతీయ విమానాలను నవంబర్ 30 వరకు నిషేధించారు. డి‌జి‌సి‌ఏ ఆర్డర్ ప్రకారం, ఎంచుకున్న విమానాలు మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి.