ఇండిగో బంపర్ ఆఫర్...తక్కువ ధరకే విమాన టికెట్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 8, Sep 2018, 11:07 AM IST
IndiGo offers domestic tickets for as low as Rs 999, international for Rs 3,199
Highlights

వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఇండిగో సంస్థ కొంతమంది ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. దీంతో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులు తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్ళే అవకాశాన్ని పొందారు. 

విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీకి ఇండిగో.. తొలిసారిగా విమాన సర్వీసుని ప్రారంభించింది. దీనిలో భాగంగా.. అతి తక్కువ ధరకే విమాన టికెట్ ని ప్రయాణికులకు అందించనున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీకి టికెట్‌ ధర రూ.3,330గా నిర్ణయించింది. వెబ్‌సైట్‌లో ముందస్తు బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన ఇండిగో సంస్థ కొంతమంది ప్రయాణీకులకు ఈ ఆఫర్‌ను కల్పించింది. దీంతో ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్న ప్రయాణీకులు తక్కువ ధరకే ఢిల్లీకి వెళ్ళే అవకాశాన్ని పొందారు. 

ఢిల్లీకి తొలి విమాన సర్వీసును నడపాలని నిర్ణయించిన ఇండిగో ఎయిర్‌లైన్స్‌ కొద్ది రోజులుగా తన వెబ్‌సైట్‌ ద్వారా ఢిల్లీకి టిక్కెట్‌ బుకింగ్‌ కూడా చేపడుతోంది. ఢిల్లీకి విమాన సర్వీసును నడుపుతున్నట్టు ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు శ్రీకారం చుట్టిన సందర్భంలో కనిష్ట ధర రూ.5,520గా ఉంది. సాధారణంగా ఢిల్లీకి ముందస్తుగా బుక్‌ చేసుకుంటే సగటు ధర రూ.6,000 ఆ పైన ఉంటుంది.
 
ఎయిర్‌ ఇండియా సంస్థ వసూలు చేస్తున్న ఛార్జీలతో విమాన ప్రయాణీకులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇండిగో భారీ తగ్గింపునిస్తుందని ఆశించారు. అయితే ఈ ప్రారంభ ఆఫర్‌ ఏమీ లేకపోవటంతో చాలామంది నిరాశ చెందారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు రూట్లలో విమానాలు నడిపేటపుడు ఒక్కసారిగా విమాన ఛార్జీల ధరలను సవరించింది.

దీంతో మిగిలిన విమానయాన సంస్థలు కూడా ధరలను తగ్గించాయి. ఢిల్లీ రూట్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని భావిస్తే.. మొదట్లో అలా జరగలేదు. అనూహ్యంగా ఇండిగో సంస్థ వెబ్‌లో ఛార్జీలను తగ్గిస్తూ ప్రకటించింది. బుకింగ్‌ కల్పించిన మొదటి వారం తర్వాత రూ.3,330, మధ్యలో రూ.2,220కు కూడా టిక్కెట్‌ లభించే అవకాశాన్ని కల్పించింది. ఢిల్లీకి తొలి విమాన సర్వీసును అక్టోబర్‌ 1వ తేదీన నడపాలని ఇండిగో ముహూర్తం నిర్ణయించింది. తెల్లవారుజాము సమయంలో ఈ విమాన సర్వీసును నడపబోతోంది. దీంతో ఢిల్లీకి ఉదయం 9 - 10 గంటల మధ్యలోనే చేరుకునే అవకాశం ఉంటుంది.

loader