మరోసారి భారీ ఆఫర్ ప్రకటించిన ఇండిగో ఎయిర్ లైన్స్

First Published 10, Jul 2018, 2:45 PM IST
IndiGo new offer: 12 lakh seats on sale, fares from Rs 1212
Highlights

2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే వరకు టికెట్  నేటి నుంచి జులై 13వ తేదీ వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. మరోసారి టికెట్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ సంస్థ 12వ వార్షికోత్సవం సందర్భంగా దాదాపు 12లక్షల సీట్లను అత్యంత చవకగా ప్రయాణికులకు అందించేందుకు నాలుగు రోజుల మెగాసేల్‌ను ఆరంభించింది. 

 టికెట్ ప్రారంభ ధర రూ.1,212గా కంపెనీ ప్రకటించింది.  ఈ రోజు నుంచి జులై 13వ తేదీలోపు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే 2018 జూలై 25నుంచి 2019 మార్చి 30 వరకూ చేసే వరకు టికెట్  నేటి నుంచి జులై 13వ తేదీ వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపింది. దాదాపు 57 ప్రధాన నగరాలను కలుపుతూ దేశీయంగా, అంతర్జాతీయంగా ఇండిగో అందిస్తున్న సేవలన్నిటికీ ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

 సంస్థ అధికార ప్రతినిధి విలియమ్‌ బౌల్టర్‌ మాట్లాడుతూ ‘ఇండిగో ఎయిర్‌లైన్స్ స్ధాపించి 2018 ఆగస్టు 4కి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ ఆఫర్‌ ఇస్తున్నాం. ప్రారంభ ధర రూ.1,212 నుంచి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. మొత్తం 12 లక్షల సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాం. ఇండిగో సేవలందిస్తున్న అన్ని మార్గాల్లో ప్రయాణించేవారు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చ’ని తెలిపారు. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో బుకింగ్‌ చేసుకునేవారు క్యాష్‌బాక్‌ కూడా పొందవచ్చని ప్రకటించింది. దీనికి కనీసం రూ.3000తో బుకింగ్‌ చేసుకోవాలని తెలిపారు.

loader