Asianet News TeluguAsianet News Telugu

ఇండిగో బాధాకరమైన నిర్ణయం..చరిత్రలోనే తొలిసారి : సీఈఓ

"ప్రస్తుతం మా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, కంపెనీ కొన్ని చేయకుండా తప్పదు. ఈ ఆర్థిక సంక్షోభం నుండి కంపెనీ కొనసాగించడం అసాధ్యం" అని దత్తా ఒక ప్రకటనలో తెలిపింది.

IndiGo has decided to lay off 10 per cent of its employess : CEO Ronojoy Dutta
Author
Hyderabad, First Published Jul 21, 2020, 11:03 AM IST

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఇండిగో తన ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించినట్లు సిఇఒ రోనోజోయ్ దత్తా సోమవారం తెలిపారు. "ప్రస్తుతం మా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, కంపెనీ కొన్ని చేయకుండా తప్పదు.

ఈ ఆర్థిక సంక్షోభం నుండి కంపెనీ కొనసాగించడం అసాధ్యం" అని దత్తా ఒక ప్రకటనలో తెలిపింది. " సాధ్యమయ్యే అన్ని జాగ్రత్తలను అంచనా వేసి, సమీక్షించిన తరువాత, మా ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించాలని నిర్ణయించింది. ఇండిగో చరిత్రలో మొదటిసారిగా మేము ఇంత బాధాకరమైన నిర్ణయం తీసుకున్నాము"అని అన్నారు. మార్చి 31, 2019 నాటికి, విమానయాన సంస్థ పేరోల్‌లో 23,531 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

ఇండిగో సిఇఒ రోనోజోయ్ దత్తా నుండి వచ్చిన నోటీస్ ప్రకారం 

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలోని అనేక పరిశ్రమలపై ప్రభావం చూపింది, వీటిలో విమానయాన రంగం కష్టతరమైన ప్రభావం ఎదురుకొంటున్న వాటిలో ఒకటి. ఇప్పుడు కూడా, 250 ఇండిగో విమానాల నుండి  కొద్ది శాతం మాత్రమే పని చేస్తున్నాయి.  

also read ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకోసం జియోమార్ట్‌ యాప్‌..ఫ్రీ డెలివరీ కూడా ...

ఈ కరోనా సంక్షోభం ప్రారంభంలోనే ఇండిగో పరిస్థితిని  అర్థం చేసుకుంది. మాకు, మా ఉద్యోగులపై ఈ ప్రభావాన్ని తగ్గించడం చాలా క్లిష్టమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలలో ఇండిగో ఒకటి, దీని వ్యాపారంలో అంతరాయం ఉన్నప్పటికీ మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు పూర్తి జీతాలను చెల్లించింది.

తదనంతరం, మేము పే కట్స్, లీవ్  విత్ ఔట్ పే, అనేక ఇతర ఖర్చులు వంటి చర్యలను చేపట్టాల్సి వచ్చింది.  కానీ దురదృష్టవశాత్తు ఆదాయాల క్షీణతను పూడ్చడానికి ఈ వ్యయ పొదుపులు సరిపడెంత లేవు. మా వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడానికి, మా కంపెనీ కొన్ని చేయకుండా తప్పడం లేదు.  

ఈ ఆర్థిక సంక్షిభం ద్వారా ప్రయాణించడం అసాధ్యం. అందువల్ల, సాధ్యమయ్యే అన్ని జాగ్రత్తలను అంచనా వేసి, సమీక్షించిన తరువాత, ఉద్యోగులలో 10 శాతం ఉద్యోగులను తొలగించడానికి నిర్ణయం తీసుకుంది. ఇండిగో చరిత్రలో మొట్టమొదటిసారిగా మేము ఇంత బాధాకరమైన చర్యను చేపట్టాము. ఈ నిర్ణయం నుండి వెలువడే అనిశ్చితులపై ప్రభావిత ఉద్యోగులకు సహాయపడటానికి, ఇండిగో ఒక ‘6ఇ కేర్ ప్యాకేజీ’ని సృష్టించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios