భారతదేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారిగా మాంద్యానికి గురవుతుందని, జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జిడిపి 8.6% తగ్గవచ్చు అని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత జిడిపి వృద్ధి మైనస్ లో ఉంటుందని ఆర్‌బి‌ఐ అధికారి తెలిపారు.

అంతకుముందు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి 23.9% క్షీణించింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో క్షీణత 8.6%(మైన‌స్‌) వరకు ఉంటుందని  ఆర్‌బి‌ఐ అభిప్రాయ‌ప‌డింది. బుధవారం ఆర్‌బిఐ బులెటిన్‌లో ఈ విషయం తెలిపింది. 'నౌకాస్టింగ్' పద్ధతి ద్వారా పరిశోధకులు దీనిని అంచనా వేశారు.

అంతే కాకుండా, ఈ సంవత్సరం మొత్తం ప్రతికూల వృద్ధి ఉంటుందని ఆర్‌బి‌ఐ అంచనా వేసింది. అంచనాల ప్రకారం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 9.5% మాత్రమే.

ఆర్‌బిఐ ద్రవ్య విధాన విభాగానికి చెందిన 'ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్' కథనం ప్రకారం, చరిత్రలో మొదటిసారి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యనికి గురవుతుందని. అయితే, క్రమంగా పరిస్థితి సాధారణమవుతోందని, సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని నివేదికలో తెలిపింది.

also read  ముకేష్ అంబానీ డ్రైవర్ నుండి కుక్ వరకు వారి జీతం ఎంతో తెలుసా.. ...

'ఎకనామిక్ యాక్టివిటీ ఇండెక్స్' ను ఆర్‌బి‌ఐ తయారు చేసింది. మే-జూన్ 2020లో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని నివేదికలో పేర్కొంది. దేశంలో కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడానికి మార్చి చివరి వారంలో లాక్ డౌన్ అమలు చేసినట్లు వివరించింది.

ఈ లాక్ డౌన్ దాదాపు మూడు నెలల పాటు తీవ్రంగా అమలు చేయబడింది, ఇది  జిడిపి రేటు తగ్గుదలలో ప్రత్యక్ష ప్రభావం కనిపించింది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి -23.9%, ఇది ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే చాలా బలహీనంగా ఉంది. ఇప్పుడు రెండవ త్రైమాసికంలో పతనం ఆందోళనలను పెంచబోతోంది.

అయితే, ఈ ఏడాది చివరి త్రైమాసికం నాటికి ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా మారుతుందని ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.