ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా.. అయితే Axis Bank FD రేట్లను సవరించింది.  సవరించిన వడ్డీ రేట్లతో ఇప్పటి నుండి మీరు మునుపటి కంటే ఎక్కువ వడ్డీ ద్వారా ఆదాయ ప్రయోజనం పొందుతారు. మార్చి 5 నుండి బ్యాంక్ FD వడ్డీ రేట్లను సవరించింది. అంతేకాదు సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అదనపు వడ్డీ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.  

ప్రతీ ఒక్కరూ సురక్షితమైన పథకాల్లో తమ కష్టార్జితాన్ని ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా బ్యాంకులు జారీ చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) పథకాలు గ్యారంటీ రిటర్నులను అందిస్తాయి. వివిధ బ్యాంకులు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. అయితే మీరు కూడా ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకుంటే Axis Bank FD రేట్లను సవరించింది. 

సవరించిన వడ్డీ రేట్లతో ఇప్పటి నుండి మీరు మునుపటి కంటే ఎక్కువ వడ్డీ ద్వారా ఆదాయ ప్రయోజనం పొందుతారు. మార్చి 5 నుండి బ్యాంక్ FD వడ్డీ రేట్లను సవరించింది. ఇప్పుడు బ్యాంకు మీకు ఏ రేటుకు వడ్డీని ఇస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

మార్చి 5 నుంచి రేట్లు మారాయి
యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FD సౌకర్యాన్ని అందిస్తుంది. మార్చి 5 నుంచి బ్యాంకు ఖాతాదారులకు 2.5 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీని అందిస్తోంది.

2 కోట్ల కంటే తక్కువ FDలపై వడ్డీ
మీరు 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు బ్యాంక్ FD చేస్తే, మీరు 5.25 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనం పొందుతారు. మీరు రూ. 2 కోట్ల కంటే తక్కువ FD చేసినప్పుడు మీరు ఈ ప్రయోజనం పొందుతారు.

యాక్సిస్ బ్యాంక్ తాజా FD రేట్లు (Axis Bank Latest FD Rates)

7 రోజుల నుండి 29 రోజుల వరకు FDలపై 2.50 శాతం
30 రోజుల నుండి 90 రోజుల FDలపై 3 శాతం
3 నెలలు < 6 నెలలు - 3.50 శాతం
6 నెలలు< 1 సంవత్సరం - 4.40 శాతం
1 సంవత్సరం< 1 సంవత్సరం 5 రోజులు - 5.10 శాతం
1 సంవత్సరం 5 రోజులు < 1 సంవత్సరం 11 రోజులు - 5.15 శాతం
1 సంవత్సరం 11 రోజులు< 1 సంవత్సరం 25 రోజులు - 5.25 శాతం
1 సంవత్సరం 25 రోజులు < 13 నెలలు - 5.15 శాతం
13 నెలలు < 15 నెలలు - 5.15 శాతం
15 నెలలు < 18 నెలలు - 5.20 శాతం
18 నెలలు< 2 సంవత్సరాలు - 5.25 శాతం
2 సంవత్సరాలు < 5 సంవత్సరాలు - 5.40 శాతం
5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు - 5.75 శాతం

సీనియర్ సిటిజన్లకు అదనపు ప్రయోజనాలు
ఇది కాకుండా, సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అదనపు వడ్డీ సౌకర్యాన్ని కల్పిస్తాయి. ఇవి కస్టమర్లకు బ్యాంకులు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు FD సదుపాయాన్ని కూడా అందజేయనున్నాయి. ఇది కాకుండా ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను మార్చాయి.