Asianet News TeluguAsianet News Telugu

మోడల్స్‌ తో ఫొటోషూట్‌ లేకుండానే ఫోటోలు.. సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసిన ఐఐటీ విద్యార్థులు..

కరోనా కారణంగ చాలా మంది ఆన్‌లైన్‌లో వైపే కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేసే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి దుస్తులను ప్రదర్శిస్తాయి.

iit students Startup develops software for displaying garment images in 3D
Author
Hyderabad, First Published Dec 2, 2020, 11:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బట్టల షాపుకి వెళ్లినప్పుడు నచ్చిన వాటిని ట్రయల్ వేసి మరి కొంటుంటం. అయితే కరోనా కారణంగ చాలా మంది ఆన్‌లైన్‌లో వైపే కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌లో దుస్తులు కొనుగోలు చేసే కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా విక్రయించే కంపెనీలు, పెద్ద బ్రాండ్లు మోడల్స్‌తో ఫొటోషూట్‌ చేసి దుస్తులను ప్రదర్శిస్తాయి. మరి చిన్న చిన్న విక్రేతలు ఆన్‌లైన్‌లో పోటీని తట్టుకోవాలంటే ఎలా ? ఖరీదైన ఫొటోషూట్స్‌తో పనిలేకుండా ఫోన్‌లో తీసిన ఫోటోలను 3డీ రూపంలో మార్చే సాఫ్ట్‌వేర్‌ను ఐఐటీ విద్యార్థులు నితీశ్‌ రెడ్డి పర్వతం, కృష్ణ సుమంత్‌ అల్వాల అభివృద్ధి చేశారు. 

ఐఐటి మద్రాస్, నాస్కామ్ ఇంక్యుబేట్ చేసిన స్టార్టప్ సంస్థ భారతీయ సంప్రదాయ వస్త్రాల ఫోటోలను ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఫోటో-రియలిస్టిక్ 3డి ఫోటోలుగా మార్చడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఈ సాఫ్ట్‌వేర్  చిన్న, మధ్యతరహా సంస్థలకు గేమ్ ఛేంజర్, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న మోడల్ ఫోటోషూట్‌ల అవసరాన్ని లేకుండా చేస్తుంది.

ట్రై3డి అనే సాఫ్ట్‌వేర్ కోవిడ్ -19 తీసుకువచ్చిన ఆర్థిక సవాళ్లను తట్టుకుని ఎస్‌ఎం‌ఈలకు సహాయం చేయడమే లక్ష్యం.గత ఏడాదిలో భారతదేశం, శ్రీలంక, అబుదాబిలలోని ట్రై3డి టెక్నాలజి ఉపయోగించి 80వేల వస్త్రాలను డిజిటలైజ్ చేసి విక్రయించారు. భారతదేశంలోని 50 ప్రాంతాల నుండి 100 మందికి పైగా కొత్త పారిశ్రామికవేత్తలు ఇప్పటికే ఈ టెక్నాలజిని ఉపయోగిస్తున్నారు.

also read 126 ఏళ్ల బాటా చరిత్రలో తొలిసారి భారత సీఈవో.. రెట్టింపైన నికర లాభాలు.. ...

"మా ప్రత్యేకమైన దుస్తులు, చీరలు వంటి వస్త్రాల  ఫోటోలను మోడల్స్, బొమ్మలు, సృజనాత్మకపై అందమైన ఫోటో-రియలిస్టిక్ 3డి ఫోటోలుగా మారుస్తుంది. సాంప్రదాయ మోడల్ ఫోటోషూట్‌ల కోసం మేము సాఫ్ట్‌వేర్ ప్రత్యామ్నాయాన్ని అభివృద్ధి చేసాము, ఫోటోషూట్‌లు చేయలేని చిన్న బోటిక్ డిజైనర్లు, చేనేత కార్మికులకు ఇది సౌకర్యంగా ఉంటుంది ”అని ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు, స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ సుమంత్ అల్వాలా అన్నారు.

"ట్రై3డి ద్వారా ఉత్పత్తి చేసిన ఫోటోలు చాలా ప్రసిద్ధ ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో ఉపయోగిస్తున్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు డిజిటల్ యుగంలో వెనుకబడి ఉండకుండా ఈ టెక్నాలజీ ముందుకు తీసుకెళ్తుంది. "చీరలలో మోడళ్లతో ఒక రోజు ఫోటోషూట్‌ను ఏర్పాటు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని, ఇప్పుడు ఈ ట్రై3డి టెక్నాలజితో దానిని సులభం చేస్తుంది. కావలసిన ఫోటో ఎటువంటి రాజీ లేకుండా, నిమిషాల వ్యవధిలో ఉత్పత్తి అవుతుంది. ఫోటోషూట్ ద్వారా తీసిన ఫోటోల కంటే మెరుగైనది కాకపోయినా ఉత్పత్తి చేసిన ఫోటో నాణ్యత సమానంగా ఉంటుంది, ”అని అన్నారు.

ఈ ట్రై3డి టెక్నాలజి గురించి వివరిస్తూ ట్రై3డి అనేది స్టార్టప్ సంస్థ, ఐ‌ఐ‌టి బాంబే పూర్వ విద్యార్థి ట్రై3డి సహ వ్యవస్థాపకుడు నితీష్ రెడ్డి పర్వతం మాట్లాడుతూ, “ ‘చీరలు, డ్రెస్‌ మెటీరియల్, హోం డెకోర్‌ ఉత్పత్తులను 3డీ రూపంలో మార్చవచ్చు. ఫొటోషూట్స్‌ ఖర్చులు ఉండవు. విక్రేతలు ట్రై3డీ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఎంపిక చేసిన దుస్తులను రెండు మూడు ఫొటోలు తీసి సాఫ్ట్‌వేర్‌లో ఉన్న టెంప్లేట్‌కు జత చేయాలి. వెంటనే 3డీ రూపంలో ఫొటో రెడీ అవుతుంది. రెండు మూడు నిముషాల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. చాలా అగ్రశ్రేణి రిటైల్ కంపెనీలు మమ్మల్ని ప్రోత్సహించాయి, ఉత్పత్తిని రూపొందించడంలో మాకు సహాయపడ్డాయి. మేము భారతదేశంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఇ-కామర్స్ లో ఒకరితో కలిసి పనిచేశాము”అని అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios