Asianet News TeluguAsianet News Telugu

ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ అవార్డుల ప్రకటన, విజేతలను అలుమిని కనెక్షన్స్2021లో సత్కరించారు..

ఆదివారం జరిగిన వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం - కనెక్షన్స్  2021 సందర్భంగా ఐఐఎంసి పూర్వ విద్యార్థుల సంఘం 5వ ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐఐఎంసిఎఎ అవార్డుల విజేతలను ప్రకటించింది. 

IFFCO IIMCAA Awards Winners announced, Golden & Silver Jubilee alumni felicitated at Connections 2021
Author
Hyderabad, First Published Mar 9, 2021, 5:51 PM IST

న్యూ ఢీల్లీ: న్యూ ఢీల్లీలోని ఐఐఎంసి హెడ్ క్వార్టర్స్ లో  ఆదివారం జరిగిన వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశం - కనెక్షన్స్  2021 సందర్భంగా ఐఐఎంసి పూర్వ విద్యార్థుల సంఘం 5వ ఐ‌ఎఫ్‌ఎఫ్‌సి‌ఓ ఐఐఎంసిఎఎ అవార్డుల విజేతలను ప్రకటించింది.

నితేంద్ర సింగ్‌కు ‘అలుమిని ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించగా, ఐఎఎస్ అధికారులు రాజేందర్ కటారియా, డాక్టర్ సౌమిత్ర మోహన్‌లకు 2021 సంవత్సరానికి ‘పబ్లిక్ సర్వీస్ అవార్డు’ లభించింది.

అగ్రికల్చర్ రిపోర్టింగ్ కి సరోజ్ సింగ్ అత్యధికంగా  లక్ష రూపాయలు గెలుచుకోగా, ఇతర విజేతలు రూ.50 వేల  అందుకున్నారు. పరిమల్ కుమార్ 'జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ (బ్రాడ్కాస్టింగ్), ఉత్కర్ష్ కుమార్ సింగ్' జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ (పబ్లిషింగ్) ', హరిత కేపీ ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ (బ్రాడ్కాస్టింగ్), పూజా కల్బాలియా యాడ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు.  సిద్ధి సెహగల్ పిఆర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అందుకున్నారు.

జార్ఖండ్ యూనిట్ అసోసియేషన్ కి  కనెక్టింగ్ చాప్టర్ ఆఫ్ ఇయర్, 2000-01 బ్యాచ్ కి ‘కనెక్టింగ్ బ్యాచ్ ఆఫ్ ది ఇయర్’, నిశాంత్ శర్మకు ‘కనెక్టింగ్ అలుమినీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ఈ సంవత్సరం పూర్వ విద్యార్థుల సంఘం గోల్డెన్ జూబ్లీ (1970-71), సిల్వర్ జూబ్లీ (1995-96) బ్యాచ్‌లను కూడా సత్కరించింది.

ఐ‌ఐ‌ఎం‌సి డి‌జి ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది ఐ‌ఐ‌ఎం‌సి‌ఏ‌ఏ విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఆలాగే “ఏ ఇన్స్టిట్యూట్  పునాది అయిన  కేవలం ఇటుకలుపై నిర్మించలేరు,  కానీ పూర్వ విద్యార్థులు ఆ పునాదిని బలపరుస్తారు, అలాగే దానిని కొత్త ఎత్తులకు తీసుకువెళతారు. సి‌సి సభ్యులు అద్భుతంగ కృషి చేసారు మరియు ఈ సంవత్సరం పూర్వ విద్యార్థుల సమావేశాన్ని నిర్వహించడం ద్వారా పాజిటివ్ ఫిలింగ్స్  తీసుకువచ్చారు. ” అని అన్నారు.

ఐఐఎంసిఎఎ అధ్యక్షుడు ప్రసాద్ సన్యాల్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి సిమ్రాత్ గులాటి, రాజేందర్ కటారియా ఎంకే టిక్కు, పార్థ ఘోష్, నితిన్ ప్రధాన్, మనోజ్ కుమార్, హర్షేంద్ర వర్ధన్ తదితరులు ప్రసంగించారు. ఢీల్లీలో జరిగే ఈ కనెక్షన్స్  2021  జాతీయ సమావేశం తరువాత వచ్చే రెండు-మూడు నెలల్లో భారతదేశం, విదేశాలలోని ఇతర ప్రధాన నగరాల్లో చాప్టర్-లెవెల్ సమావేశాలు జరుగుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios