మొత్తం 12 రాష్ట్రాల్లో 500 ఎలక్ట్రిక్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ HPCL ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ప్రొవైడర్ స్టాటిక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జర్లను HPCL పెట్రోల్ పంప్ అవుట్‌లెట్‌లలో ఇన్‌స్టాల్ చేస్తారు. వీటిలో బైక్, స్కూటర్, స్కూటీ, కారు మొదలైనవి ఛార్జ్ చేయవచ్చు.

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్ నెట్‌వర్క్ అనేది అతిపెద్ద సవాలుగా మారింది. ఈ లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ HPCLఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ప్రొవైడర్ స్టాటిక్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద కంపెనీ 12 రాష్ట్రాల్లో 500 ఎలక్ట్రిక్ ఛార్జర్లను అమర్చనుంది. ఈ ఎలక్ట్రిక్ ఛార్జర్‌లు HPCL అవుట్‌లెట్‌లకు కనెక్ట్ చేయనున్నారు. వీటిని పెట్రోల్ పంపుల వద్ద ఇన్ స్టాల్ చేయనున్నారు. ఈ పాయింట్ల వద్ద అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాల చార్జర్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో బైక్, స్కూటర్, స్కూటీ, కారు మొదలైనవి ఛార్జ్ చేయవచ్చు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు , పశ్చిమ బెంగాల్‌లో వీటిని అమర్చనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం 500 ఛార్జర్లలో దాదాపు 400 ఛార్జర్లు 3.3 కిలోవాట్ల సామర్థ్యం కలిగి ఉంటాయి. 

ఇది కాకుండా, మిగిలిన ఛార్జర్లు 7.7 kW. స్టాటిక్ గత సంవత్సరంలో ఇప్పటికే దాదాపు 200 ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. వీటిలో 130 ఛార్జర్‌లు 3.3 కిలోవాట్ల సామర్థ్యం, 75 ఛార్జర్‌లు 7.7 కిలోవాట్ల ఛార్జర్‌లు. ఈ 200 ఛార్జర్లను HPCL పెట్రోల్ పంపుల వద్ద మాత్రమే అమర్చారు. ప్రస్తుతం వీటిని మీరట్, ఆగ్రా, గోరఖ్‌పూర్, వారణాసి, కాన్పూర్, లక్నో, డెహ్రాడూన్, పాట్నాలో వీటిని అమర్చారు. 

ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా సైబర్ దాడులకు గురయ్యే అవకాశం..గడ్కరీ

ఇతర సాంకేతిక అప్లికేషన్‌ల మాదిరిగానే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా సైబర్ దాడులకు గురవుతాయి. ఇవి సైబర్ సెక్యూరిటీ సంఘటనలకు మరింత హాని కలిగిస్తాయి" అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్‌కు బాధ్యత వహిస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఇలాంటి సంఘటనలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌లకు సంబంధించిన ఉత్పత్తులు, అప్లికేషన్‌లలో లోపాలపై ఓ నివేదికను అందుకుంది, దానిపై "ప్రభుత్వం వివిధ సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను నిశితంగా పరిశీలిస్తోందని, హ్యాకింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి చురుకుగా చర్యలు తీసుకుంటోంది" అని పేరొన్నారు.