కరోనా సమయంలో చాలా మంది  యువత ఉద్యోగాలను కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారికి స్వయం ఉపాధి పొందేందుకు అనేక అవకాశాలను కల్పించింది. ముఖ్యంగా ముద్ర రుణాల ద్వారా యువత స్వయం ఉపాధిని పొందుతున్నారు.

ఉద్యోగం కన్నా వ్యాపారంలో సంపాదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి అనేక వ్యాపారాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది. పేపర్ నాప్‌కిన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ఈ వ్యాపార ఆలోచనలలో ఒకటి.

ఐరోపా దేశాల్లో న్యాప్‌కిన్ పేపర్లకు మంచి డిమాండ్
ఐరోపా దేశాలతో సహా శీతల వాతావరణ దేశాల్లో టిష్యూ పేపర్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి నివారణ కోసం యూరోపియన్ దేశాలు కూడా లాక్‌డౌన్ విధించడానికి చర్యలు తీసుకున్నప్పుడు, ప్రజలు ముందుగా నెలలకు సరిపడే పేపర్ న్యాప్‌కిన్ లను కొనుగోలు చేసి స్టాక్ దాచుకున్నారు. అంటే అక్కడ దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఐరోపా దేశాలలో ప్రజలు ఎక్కువగా టిష్యూ పేపర్ వాడుతుంటారు. సూపర్‌మార్కెట్‌లు, రిటైల్‌ దుకాణాల నుంచి వచ్చే టిష్యూ పేపర్‌ విపరీతంగా కొనుగోలు చేస్తారు. 

మన దేశంలో కూడా డిమాండ్ పెరిగింది...
ఐరోపా దేశాల్లో మాదిరిగా భారతదేశంలో టిష్యూ పేపర్ల వినియోగం ఎక్కువగా లేకపోయినా, ఇక్కడ కూడా దీనికి భారీ మార్కెట్ ఉంది. భారతదేశంలో టిష్యూ పేపర్ వినియోగం చాలా ఉంది. దీని మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. మరో విషయమేమిటంటే, భారతీయ మార్కెట్లో బ్రాండెడ్ న్యాప్‌కిన్‌లతో పాటు, స్థానిక ఉత్పత్తుల వినియోగం చాలా ఉంది. ఈ కారణంగా, నాప్‌కిన్ పేపర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం లాభదాయకమైన వ్యాపారం అవుతుంది. మీ ప్రాంతంలో హోల్ సేల్ గా విక్రయించడం ద్వారా మీరు లక్షలు సంపాదించవచ్చు. దీని ప్లాంట్‌ను ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవసరమవుతుంది, ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందుతుంది. దీని ద్వారా మీరు ఎంత లాభం పొందగలరో తెలుసుకుందాం...

న్యాప్‌కిన్ తయారీ యంత్రాన్ని ఎంతలో కొనుగోలు చేయవచ్చు
ఇండియామార్ట్‌లో ప్రస్తుతం ఉన్న సరఫరాదారుల ప్రకారం, నాప్‌కిన్ పేపర్ తయారీ యంత్రం రూ.5 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మీరు సెమీ ఆటోమేటిక్ యంత్రాన్ని కొనుగోలు చేస్తే, మీరు దానిని 5-6 లక్షల రూపాయలకు పొందుతారు. నాలుగు నుండి ఐదు అంగుళాల న్యాప్‌కిన్ పేపర్‌లను తయారు చేయగల వారి సామర్థ్యం ప్రతి గంటకు 100 నుండి 500 వరకూ ఉంటుంది. మీరు పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, గంటకు 2,500 రోల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉన్న అధిక సామర్థ్యంతో కూడిన పూర్తి ఆటోమేటిక్ యంత్రం రూ.10-11 లక్షలకు అందుబాటులో ఉంది.

ముద్ర రుణంతో స్థాపించవచ్చు...
ఈ వ్యాపారం కోసం మీరే రూ. 3.50 లక్షలు సమీకరించినట్లయితే, మీరు ప్రభుత్వ ముద్రా పథకం కింద కూడా రుణం పొందవచ్చు. మీ దగ్గర అంత డబ్బు ఉంటే, మీరు ముద్రా యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేస్తే, మీరు రూ. 3.10 లక్షల టర్మ్ లోన్ మరియు రూ. 5.30 లక్షల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందవచ్చు. ఈ విధంగా, మీరు దాదాపు 12 లక్షల రూపాయలను పొందుతారు, దీంతో మీరు వ్యాపారాన్ని సులభంగా ప్రారంభించవచ్చు.

ఒక చిన్న ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా న్యాప్‌కిన్ పేపర్ ఉత్పత్తిని సులభంగా చేయవచ్చు, ఏడాదికి 1.50 లక్షల కిలోల వరకు న్యాప్‌కిన్ పేపర్‌ను తయారు చేయవచ్చు. న్యాప్‌కిన్ పేపర్‌ను కిలో రూ.65 చొప్పున మార్కెట్‌లో సులభంగా విక్రయించవచ్చు. ఈ విధంగా, మీరు ఒక సంవత్సరంలో దాదాపు కోటి రూపాయల టర్నోవర్‌ను సులభంగా సాధించవచ్చు. ముడిసరుకులు, యంత్ర ఖర్చులు, రుణ వాయిదాలు తొలగించినా, మొదటి సంవత్సరంలోనే ఈ వ్యాపారం ద్వారా రూ.10-12 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.