T-shirt ప్రింటింగ్‌ బిజినెస్‌ చేస్తే లక్షల్లో ఆదాయం

టీ-షర్ట్ ప్రింటింగ్‌ బిజినెస్‌ చక్కటి విజన్‌తో ప్రారంభిస్తే నెలకు రూ.లక్షల్లో లాభాలు తెచ్చే వ్యాపారంగా మారుతుంది. రూ.10 వేల తక్కువ పెట్టుబడితో ప్రారంభించి లోకల్‌ మార్కెట్లలోనే కాకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా బిజినెస్‌ చేస్తూ విస్తరించవచ్చు. T-shirt ప్రింటింగ్‌ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి. ఎలా మార్కెటింగ్‌ చేసుకోవాలి తదితర వివరాలు తెలుసుకుందాం.. రండి.
 

How to Start a Profitable T-Shirt Printing Business with Minimal Investment sns

ప్రస్తుతం మార్కెట్‌లో క్లాత్‌ బిజినెస్‌ త్వరగా లాభాలు తెచ్చే వ్యాపారాల్లో ఒకటి. క్లాత్‌ బిజినెస్‌ ఏ కాలంలోనైనా చేయగల వ్యాపారం. అన్ని వయసుల వారికి అవసరమైన వస్తువు కాబట్టి అందరూ తప్పకుండా దుస్తులు కొంటారు. డ్రెస్సులు, షర్టులు, ఫ్యాంట్లు ఎంత కాలమైనా దెబ్బతినవు కాబట్టి నష్టాలు రావడానికి అవకాశాలు తక్కువ. అయితే క్లాత్‌ బిజినెస్‌ చేసే వారు తప్పక పాటించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ డ్రెస్స్‌లు, షర్టులు, ఫ్యాంట్లు వినియోగదారులకు అందించాలి. 

టీ-షర్ట్‌ బిజినెస్‌ చేయాలంటే ముందుగా ఇవి తెలుసుకోవాలి..
1. మార్కెట్ రీసెర్చ్‌: మార్కెట్‌లో ఎలాంటి టీ-షర్టులకు డిమాండ్‌ ఉందో రీసెర్చ్‌ చేయాలి. ప్రజలు ఎలాంటి వాటిని కొనాలనుకుంటున్నారో తెలుసుకోవాలి. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకున్న ప్రాంతంలో ప్రజలు అభిరుచిని గమనించాలి. ముఖ్యంగా యూత్‌, టీనేజర్లు, స్పోర్ట్స్‌ టీమ్స్‌, కంపెనీల ఉద్యోగులు ఎలాంటి టీ-షర్టులు వేసుకుంటున్నారో, ఎలాంటివి కావాలనుకొంటున్నారో ఓ సర్వే చేయాలి. 

 T-shirt ప్రింటింగ్‌కి కావాల్సిన వస్తువులు..
టీ-షర్ట్‌ ప్రింటింగ్ కోసం ప్రింటింగ్‌ మెషీన్ కావాలి. స్క్రీన్ ప్రింటింగ్ మెషీన్, డై సబ్‌లిమేషన్ ప్రింటర్, హీట్ ప్రెస్ మెషీన్ వంటి వివిధ రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.10 వేల నుంచి రూ.1,50, 000 వరకు వివిధ రకాల మెషీన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.  వీటితో పాటు డిజైనింగ్ సాఫ్ట్ వేర్లు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. Adobe Illustrator, CorelDRAW, Photoshop వంటివి ప్రింటింగ్‌ మెషీన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైనది రా మెటీరియల్స్. అంటే Plain T-Shirts (Cotton, Polyester) తెచ్చిపెట్టుకోవాలి. లేదా ప్లేన్‌ టీ-షర్టులు తయారు చేసే కంపెనీతో టైఅప్‌ కావాలి.

రిజిస్ట్రేషన్ & లైసెన్స్‌ తీసుకోవాలి
టీ-షర్ట్‌ బిజినెస్ ప్రారంభించే ముందు పక్కా ప్లాన్ తయారు చేసుకోవాలి. వ్యాపార లక్ష్యాలు, ప్రాజెక్ట్‌ ఎక్స్‌పెన్సెస్‌, టార్గెట్ కస్టమర్లు, మార్కెటింగ్ స్రాటెజీ, రిటర్న్స్ ప్లాన్ ఇలా అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉండాలి. వాటి తర్వాత వ్యాపారం రిజిస్ట్రేషన్ GST రిజిస్ట్రేషన్ చేయించాలి. లైసెన్స్‌ పొందాలి. 
 
ప్లేస్‌ చాలా ఇంపార్టెంట్‌..
ప్రింటింగ్ యూనిట్‌ను సరైన ప్రదేశంలో సెట్ చేయడంపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మారుమూల ఏర్పాటు చేస్తే అక్కడదాకా వచ్చి ఆర్డర్లు ఇవ్వడానికి అవకాశాలు తగ్గిపోతాయి. అందుకని మార్కెట్‌లోనే అందరికీ కనిపించేలా, అందుబాటులో ఉండేలా యూనిట్‌ ఏర్పాటు చేయడం ముఖ్యం. టీ-షర్ట్‌ బిజినెస్‌లో డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్‌. మీ సొంత లేబుల్స్‌ ఉంటే మంచిది. లేకుంటే ప్రైవేట్ లేబుల్స్‌, కస్టమర్ బ్రాండింగ్ సర్వీస్‌ చేసి వినియోగదారులను ఆకట్టుకోవచ్చు. కస్టమర్ అవసరాలకు అనుగుణంగా డిజైన్లు తయారు చేయడం ఇందులో చాలా ముఖ్యమైన అంశం. 

మార్కెటింగ్‌ ఇలా..
టీ-షర్ట్‌ ప్రింటింగ్‌ బిజినెస్‌ ద్వారా నెలకు రూ.1,50,000 వరకు ఆదాయం సంపాదించవచ్చు. 
మీ యూనిట్‌ పేరుతో  బిజినెస్‌ కార్డులు ప్రింట్‌ చేయించి మీ మార్కెట్‌లో అందరికీ పంచాలి. ఫ్లెక్సీలు తయారు చేయించి సెంటర్లలో ఏర్పాటు చేయించాలి. ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా (Instagram, Facebook,)ను ఉపయోగించుకొని ప్రచారం చేసుకోవాలి. వచ్చిన కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ తీసుకొని వారి సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

లాభాలు ఇలా..
ఒక్కో ప్లేన్‌ టీ షర్ట్ రూ.90 దొరుకుతుంది. ఇంక్‌(Ink), ట్రాన్స్‌ఫర్‌ పేపర్స్‌(Transfer Papers), ఇతర వస్తువులు ఉపయోగించి టీ షర్ట్‌పై ప్రింటింగ్‌ చేస్తే 150 అవుతుంది. ఈ టీ షర్ట్‌ను రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముకోవచ్చు. ఇలా నెలకు కనీసం 1000 చొప్పున టీ షర్ట్‌లు విక్రయిస్తే మినిమం రూ.లక్ష నుంచి రూ.1,50,000 వరకు ఆదాయం పొందవచ్చు. మీ బిజినెస్‌ సక్సెస్‌ అయ్యాక ఫ్రాంచైజిలు, బ్రాంచెస్ ఏర్పటు చేసి బిజినెస్ విస్తరించవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios