How to Become Rich: మీరు ఈజీగా కోటీశ్వరుడు అవ్వాలంటే, ఈ 10 సూత్రాలు పాటించి చూడండి..
మీరు కోటి రూపాయలు సంపాదించడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారా.. అయితే క్రింద పేర్కొన్న పది సూత్రాలను పాటించడం ద్వారా మీరు సులభంగా కోటీశ్వరులు అవ్వచ్చు.. తద్వారా మీరు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆ పది సూత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో ఒక కోటి రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ మీ వద్ద ఉంటే జీవితం హాయిగా గడిచిపోతుందని, భావించే వారి సంఖ్య భారత దేశంలో అత్యధిక సంఖ్యలో ఉంది. ఎందుకంటే ఒక కోటి రూపాయలు అనేది భారతదేశంలో చాలా పెద్ద మొత్తం. ఒక కోటి రూపాయలు ఉంటే చాలు బ్యాంకులో వేసుకొని ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తో వచ్చే డబ్బుతోనే జీవితాన్ని గడిపేయొచ్చని భావించేవారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఒక కోటి రూపాయలు సంపాదించడం ఎలా అని ఆలోచించే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా కోటీశ్వరుడు అవ్వాలని భావిస్తున్నారా అయితే ఓ పది సూత్రాలు మీకోసం.
ఆదాయంలో కొంత భాగం పెట్టుబడి పెట్టండి
మనం సంపాదించిన డబ్బులు పొదుపు కన్నా కూడా పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక ఆదాయం పొందే వీడుంది. ఉదాహరణకు మీరు బ్యాంకులో డిపాజిట్ చేసినట్లయితే కేవలం వడ్డీ డబ్బు మాత్రమే వస్తుంది అదే డబ్బుతోని మీరు స్టాక్ మార్కెట్లో గాని మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ పెట్టుబడి చాలా రెట్లు లాభాన్ని పొందే అవకాశం ఉంది. తద్వారా మీద సులభంగా కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది.
లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి..
కోటీశ్వరుడిగా మారడానికి, మీరు చిన్న లక్ష్యాలను సాధించడం చాలా ముఖ్యం. ఒక సంవత్సరంలో మీరు మూడు లక్షల నుంచి 5 లక్షల రూపాయలు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రణాళిక బద్ధంగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది అదే విధంగా, ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్స్ లో కూడా డబ్బు పెట్టడం ద్వారా సెన్సెక్స్ నిఫ్టీ తో సమానంగా మీరు లాభం పొందే అవకాశం ఉంది.
విజయవంతమైన వ్యాపారం చేయండి..
కోటీశ్వరుడు అవ్వాలంటే ఉద్యోగం కన్నా వ్యాపారం చేయడం ద్వారా అత్యధిక లాభం పొందే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లో కొత్త తరహా వ్యాపారాలను అందిపుచ్చుకోవడం ద్వారా మీరు అధిక లాభాన్ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు స్టార్ట్ అప్ కంపెనీలను స్థాపించి ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ ఆంత్రప్రెన్యూర్స్ ఏకంగా బిలీనియర్లుగా మారుతున్నారు. అందుకే వ్యాపారం చేసే ముందు టెక్నాలజీని జోడించి, మార్కెట్ ను అర్థం చేసుకొని రెడీ చేసి చక్కటి పెట్టుబడితో ప్లానింగ్ తో, రంగంలోకి దిగితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంది.
స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టండి
80వ దశకంలో Apple, Google, Microsoft వంటి కంపెనీల పేర్లు ఎవరికి తెలియవు. అప్పట్లో అవన్నీ స్టార్టప్ కంపెనీలు. ఈ స్టార్టప్‌లలో చేరి పెట్టుబడులు పెట్టినవారు నేడు బిలియనీర్లుగా ఉన్నారు. అంతేకాదు మనదేశంలో కూడా ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో 1990 దశకంలో 1 లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసిన వారు నేడు కోట్లల్లో లాభాలను పొందుతున్నారు అందుకే భవిష్యత్తును ఊహించి పెట్టుబడులు పెట్టడం ద్వారా చక్కటి లాభాలను పొందే అవకాశం ఉంది.
ప్రమాదానికి భయపడవద్దు, సంపదను పెంచుకోండి
కోటీశ్వరుడు కావడానికి అతిపెద్ద అడ్డంకి ఏమిటంటే మీరు ఎంత రిస్క్ తీసుకోకపోవడం. మీరు ధనవంతులు కావాలంటే, రిస్క్ తీసుకోవాలి. అయితే, మీరు ఏ ప్రాంతంలో రిస్క్ తీసుకోవాలో నిర్ణయించుకోవడం మీ ఇష్టం. ఏ రంగంలో రిస్క్ తీసుకుంటే మీ పెట్టుబడిపై మంచి రిటర్న్ వస్తుందో పూర్తిగా బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో రిస్కు తీసుకోవాలి అనుకుంటే, మీ ఆదాయంలో కచ్చితంగా పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది తద్వారా మీరు, మీ రిస్కు రివార్డు పొందే అవకాశం లభిస్తుంది. . అయితే ఎమర్జెన్సీ ఫండ్ కింద మీరు మీ నష్టాన్ని భర్తీ చేసుకోగలిగే అంత డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు రిస్క్ తీసుకుంటే మంచిది.
లాంగ్ టర్మ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టండి
మీరు స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టగలిగితే, ఖచ్చితంగా పెట్టుబడి పెట్టంటి. మీరు మంచి వ్యాల్యూషన్ ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి ఏడాది లాభాన్ని పొందవచ్చు ఉదాహరణకు లాడ్జి క్యాప్ కంపెనీలు అయినటువంటి రిలయన్స్, టిసిఎస్, HDFC Bank, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ లాంటి షేర్లు స్థిరంగా రాబడి అందిస్తూ ఉంటాయి. . అయితే మీ పోర్ట్ పోలియోను డైవర్సిఫైడ్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది.
ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టండి..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పొదుపు పథకాల్లో డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు పైన ఖచ్చితమైన ఆదాయం పొందే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ (POMIS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC), సుకన్య సమృద్ధి. లాంటి పథకాల్లో మీరు భేషుగ్గా డబ్బును ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.
బీమాపై పెట్టుబడి పెట్టండి..ఆరోగ్యంపై శ్రద్ద వహించండి..
పెట్టుబడిలో కొంత భాగం కచ్చితంగా ఆరోగ్య భీమాపైన పెట్టాల్సిందే. మంచి మెడికల్ క్లెయిం పాలసీలో డబ్బు పెట్టడం ద్వారా ఆకస్మికంగా మీరు అనారోగ్యం పాడిన పడి ఆసుపత్రిలో జరిగినట్లయితే డబ్బు ఖర్చు కాకుండా సేవ్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక మెడిక్లెయిం పాలసీలు ఉన్నాయి. . మీ కుటుంబ సభ్యుల పేరిన ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. తద్వారా అనవసరపు ఆసుపత్రి ఖర్చులు తప్పే అవకాశం ఉంది తద్వారా మీరు పొదుపు చేసిన డబ్బు ఖర్చవ్వకుండా కాపాడుకోవచ్చు.
అనవసరపు ఖర్చులను ట్రాక్ చేయండి..
మీ ఆదాయంలో అనవసరపు ఖర్చులు ఏమేమి ఉన్నాయో గుర్తించి వెంటనే వాటిని కట్ చేయండి. లేకపోతే మీ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అనవసరంగా రెస్టారెంట్లలోనూ బయట ఇతర పనులకు డబ్బులు ఖర్చు చేయడం ద్వారా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. తక్కువ ఖర్చులో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేయగలిగే మార్గాలను అన్వేషించండి. మీరు రోజువారి జీవితంలో ఆహ్లాదంగా గడిపే క్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందే కానీ వాటి కోసం అనవసరమైన ఖర్చులను చేసే బదులుగా ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేస్తే మంచిది.
ఉద్యోగంలో చేరినప్పటి నుంచే పొదుపు పై శ్రద్ధ పెట్టండి
పొదుపు కూడా తప్పనిసరే మీరు సంపాదించే ఆదాయంలో పూర్తిగా పెట్టుబడి పై పెడితే రిస్క్ అనే చెప్పాలి అందుకే మీ ఆదాయంలో కొంత భాగం పొదుపుపై కూడా కేటాయించాల్సిందే. రికరింగ్ డిపాజిట్లలో పొదుపు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. పోస్ట్ ఆఫీసుతో సహా, అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల్లో ఈ రికరింగ్ డిపాజిట్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే బంగారంపై పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా చక్కటి ఆదాయం పొందవచ్చు అయితే బంగారంపై ప్రత్యక్ష పెట్టుబడి కన్నా కూడా డిజిటల్ రూపంలో బాండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.