డెలివరీ బాయ్స్ ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఆ ఉద్యోగాల కోసం వెతికే వారు కూడా ఉంటారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో డెలివరీ బాయ్ ఉద్యోగం ఎలా సంపాదించాలి? వారికి ఎలాంటి సదుపాయాలు లభిస్తాయో తెలుసుకోండి

మనదేశంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లను వాడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఇండియాలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్స్ షాపింగ్‌కి ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి నుంచి ఇంట్లో కూర్చునే ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు కాబట్టి వీటికి లాభాలు అధికంగానే వస్తున్నాయి. వీటిలో దొరకని వస్తువు అంటూ లేదు, అందుకే వస్తువులు కొనడానికి ఇంట్లోంచి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా పడడంలేదు. మీరు ఆర్డర్ పెట్టిన వస్తువులను మీ ఇంటికే డెలివరీ బాయ్స్ వస్తువులు తెచ్చి అందిస్తారు. డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న వారిసంఖ్య కూడ అధికంగానే ఉంది. ఎన్నో కుటుంబాలు ఈ ఉద్యోగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతిరోజూ పార్సిల్స్ డెలివీర చేసే బాయ్స్ జీతం ఎంత? రోజుకి ఎంత సంపాదిస్తారో అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ ఉద్యోగం ఎలా పొందాలో, అందులో ఎలాంటి సదుపాయాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్న వారికి ఇక్కడ మేము ఆ సమాచారాన్ని ఇచ్చాము. 

డెలివరీ బాయ్ ఉద్యోగం ఎలా పొందాలి?

ఆజ్‌తక్ నివేదిక చెబుతున్న ప్రకారం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద కంపెనీలు తమ పాలసీల ప్రకారం జీతాలను అందిస్తాయి. ఆయా సంస్థల్లో డెలివరీ బాయ్‌గా పనిచేయాలనుకునే వారు నగరంలోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. వారు మీ దరఖాస్తుతో పాటూ మీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు వంటివి పరిశీలిస్తారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయితే శిక్షణ ఇస్తారు. తర్వాత కస్టమర్లకు పార్సిల్స్ అందించడం మొదలవుతుంది. ఎవరు, ఎక్కడ, ఏ ప్రాంతంలో డెలివరీ చేయాలో కూడా కంపెనీయే నిర్ణయిస్తుంది. 

శిక్షణలో భాగంగా రూట్లు, ప్రాంతాలు, GPS, గూగుల్ మ్యాప్ వాడకం అన్నింటినీ నేర్పుతారు. ప్యాకేజీలను పగలకుండా జాగ్రత్తగా చూసుకోవడం, కస్టమర్లతో మాట్లాడటం, ఫిర్యాదులను పరిష్కరించడం వంటివి శిక్షణలోనే నేర్పుతారు.

డెలివరీ బాయ్ జీతం ఎంత?

డెలివరీ బాయ్ గా చేరాక అతను ఎంత సంపాదిస్తాడన్నది ప్రాంతం, పార్సిల్‌ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. రోజుకి ఒక డెలివరీ బాయ్ దాదాపు 80 పార్సిల్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రధాన నగరాల్లో అయితే ఈ సంఖ్య పెరుగుతుంది. ఎవరు ఎన్ని పార్సిల్స్ ఇవ్వాలో కూడా కంపెనీయే నిర్ణయిస్తుంది. ఒక పార్సిల్‌కి ₹12 నుండి ₹14 వరకు కమిషన్ లభిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి రోజుకు 80 పార్శిల్స్ డెలివరీ చేస్తే అతడికి రోజుకు 1000 రూపాయల దాకా సంపాదిస్తాడు. నెల మొత్తం జీతం అతడు చేసిన పార్సిల్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

వస్తువు పోతే?

కొన్నిసార్లు డెలివరీ చేసే సమయంలో వస్తువులు పగిలిపోవడం, లేదా కనిపించకుండా పోవడం వంటివి జరుగుతాయి. దీనికి కంపెనీ ఎలాంటి బాధ్యత వహించదు. ఆ వస్తువు ఖరీదును డెలివరీ బాయ్ చెల్లించాల్సి వస్తుంది. వస్తువు ముందే పగిలి ఉంటే దాన్ని ముందే చెక్ చేసి డెలివరీ బాయ్ దాన్ని తీసుకునేందుకు నిరాకరించవచ్చు.

ఏ సదుపాయాలు లభిస్తాయి?

డెలివరీ బాయ్ కి జీతంతో పాటు కొన్ని కంపెనీలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఇన్సెంటివ్స్ వంటి సదుపాయాలు అందిస్తాయి. అది కంపెనీని బట్టి మారుతూ ఉంటాయి.

ఎక్కువగా అడిగే ప్రశ్నలు-

డెలివరీ బాయ్ రోజుకి ఎంత సంపాదిస్తాడు?

డెలివరీ బాయ్ రోజుకి 80 నుండి 100 పార్సిల్స్ డెలివరీ చేయాల్సి ఉంటుంది. అతని జీతం రోజుకి 1000 రూపాయలకు పైగానే ఉండే అవకాశం ఉంది. 

డెలివరీ బాయ్ జీతం ఫిక్స్‌డ్‌గా ఉంటుందా?

ఇది కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది. కొన్ని కంపెనీలు కమిషన్, ప్యాకేజీ ఆధారంగా కూడా చెల్లిస్తాయి. నెల జీతం ఫిక్స్ డ్ గా ఉండదు. పార్శిళ్లను బట్టి పెరగడం, తగ్గడం వంటివి ఉంటాయి. 

ఫ్లిప్‌కార్ట్ లేదా అమెజాన్ ఏది బెటర్?

రెండు కంపెనీలకీ జీతం చెల్లింపులో ప్రత్యేక నియమాలు ఉంటాయి. కాబట్టి జీతం, సదుపాయాల్లో తేడా కనిపించే అవకాశం ఉంది. ఈ రెండూ కూడా మంచి ఫ్లాట్ ఫారమ్స్ అనే చెప్పుకోవాలి.

నిరాకరణ- ఇక్కడ ఇచ్చిన సమాచారం అంతా ఇంటర్నెట్ నుండి తీసుకోబడింది. ఏషియానెట్ హిందీ దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. మరిన్ని వివరాలకు కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లను చూడండి.