Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ ట్యాక్స్ అంటే ఏంటి : అమెరికా అంక్షలతో భారత్‌కు ఎందుకు నష్టం

ఇప్పటికే హెచ్1-బీ వీసాల రద్దు, జీఎస్పీ మినహాయింపు వంటి నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. తాజాగా భారతదేశంలో లావాదేవీలు జరుపుతున్న యూఎస్ సంస్థల ఆదాయంపై ఈక్వలైజేషన్ ట్యాక్స్ పేరిట మరోసారి భారం మోపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

govt doesn't major threat of google tax
Author
Hyderabad, First Published Jul 14, 2020, 10:40 AM IST

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా తన దేశ టెక్ దిగ్గజాలపై అమెరికా విధించిన గూగుల్ ట్యాక్స్ (ఈక్వలైజేషన్ ట్యాక్స్) ప్రభావం భారత్ మీద ఉండదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. టెక్ దిగ్గజం ‘గూగుల్’తోపాటు ఫేస్‌బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపులు అమెరికా ప్రభుత్వ నిఘాలో ఉన్నాయి. 

భారత్ సహా వివిధ దేశాల్లో తమ సంస్థల లావాదేవీల, పన్ను చెల్లింపులపై దర్యాప్తు చేస్తున్నామని గత నెలలో అమెరికా పేర్కొంది. అయితే అసలు ఈక్వలైజేషన్ టాక్స్ అంటే ఏమిటి? దానివల్ల భారత్‌కు జరిగే నష్టాన్ని పరిశీలిద్దాం.. 

అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగా ఉన్నా.. అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్యం, విద్యార్థులూ ఐటీ నిపుణులకు వీసాల జారీ విషయంలో మాత్రం తనదైన శైలిలో ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. 

కరోనా వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్న సాకుతో విదేశీయులకు ఈ ఏడాది వరకు హెచ్1-బీ సహ ఇతర వీసాల జారీని నిలిపివేశారు. పేరుకు విదేశీయులకు వీసాలు రద్దు చేసినా ఆచరణలో భారతీయులపైనే ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఇంకా రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు, ఇంతకుముందు భారతదేశానికి అమెరికా కల్పించిన ‘జీఎస్పీ’ మినహయింపును ఎత్తివేయడం వంటి నిర్ణయాలతో ట్రంప్ ఇబ్బందుల పాల్జేస్తూనే ఉన్నారు. తమ ఉత్పత్తులపై ఇండియాలో అధిక పన్నులు విధించారని నేరుగా ప్రధాని నరేంద్రమోదీ పేరు పెట్టే విమర్శలు చేసేవారు. 

ఇప్పుడు ఇరు దేశాల మధ్య మరో వివాదం క్రమంగా తీవ్రమవుతోంది. ఆ వివాదం ముదిరితే భారతదేశ వస్తువులపై అమెరికా భారీగా పన్నుల భారం మోపే ప్రమాదం పొంచి ఉంది. ఆ వివాదమే గూగుల్ ట్యాక్స్.

భారత్-అమెరికా మధ్య ఇటీవల తరుచూ వినిపిస్తున్న పేరు గూగుల్ ట్యాక్స్ (ఈక్వలైజేషన్ ట్యాక్స్). ఈ చట్టాన్ని 2016-17లో అమెరికా ఈ చట్టాన్ని ట్రంప్ అమలులోకి తెచ్చారు. ఈ చట్టం పరిధిలోకి ‘వాణిజ్యం ప్రకటనలతో అత్యధిక ఆదాయం పొందుతూ దేశం బయట శాశ్వత కార్యాలయాలు గల డిజిటల్ కంపెనీలను’ తీసుకువచ్చారు. 

also read టార్గెట్ ‘ఇండియా డిజిటలైజేషన్’: భారతదేశంలో గూగుల్ భారీ పెట్టుబడులు ...

గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. వీటికి వాణిజ్య ప్రకటనల భారతదేశంలో అత్యధిక ఆదాయం లభిస్తోంది. వాస్తవంగా డిజిటల్ కంపెనీలు చెల్లించాల్సిన స్థాయిలో పన్నులు కట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటి వరకు మన దేశీయ పన్నుల వ్యవస్థలో డిజిటల్ ప్రపంచం విషయమై సరైన చట్టాలు లేకపోవడం కూడా ఒక కారణం. దీనికి తోడు భారతదేశంలో వాణిజ్య ప్రకటనల సొమ్ము విదేశాల్లోని కంపెనీ ప్రధాన కార్యాలయాలకు వెళుతున్నది. 

కనుక అవి దేశీయంగా ఏర్పాటు చేసిన అనుబంధ కంపెనీకు పేరు తర్వాత ‘ఇండియా లిమిటెడ్‘ అని పెట్టకున్నా.. వాటి నుంచి  పన్నులు అంతగా రాకపోవడం ఒక కారణం. ఎందుకంటే ఆదాయంలో ఎక్కువ భాగం విదేశాల్లోని మాత్రు సంస్థలకు చేరిపోతుంది. ఈ నేపథ్యంలో ఈక్వలైజేషన్ లేవీ ప్రత్యక్ష పన్నును తీసుకువచ్చింది. 

వాస్తవంగా డిజిటల్ సంస్థలకు పన్ను తక్కువగా విధించే వివిధ దేశల్లో అనుబం కంపెనీలుంటాయి. ఇక్కడ వచ్చిన ఆదాయం పలు ఖర్చులు, వ్యయాల రూపంలో విదేశాల్లోని అనుబంధ కంపెనీలకు బదిలీ చేస్తున్నాయి. దీంతో తక్కువ లాభం చూపి, ఆ మేరకు పన్నులు చెల్లిస్తున్నాయి. 

2018లో ఒక దిగ్గజ సంస్థ రూ.16 వేల కోట్లను సింగపూర్‌కు తరలించినట్లు వార్తలొచ్చయి. ఐరోపాలో పలు కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను పన్ను స్వర్గధామంగా పేరు ఉన్న ఐర్లాండ్‌లో నిర్వహిస్తుండటంతో మిగతా దేశాలకు ఆదాయం పడిపోయింది.

దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం లాభంతో సంబంధం లేకుండా ఆదాయంపై మూడు శాతం పన్ను చెల్లించాలని అమెరికా కంపెనీలకు డిజిటల్ ట్యాక్సును విధించింది. భారత్ కూడా 2016లో డిజిటల్ కంపెనీల వాణిజ్య ప్రకటనల ఆదాయంపై 6 శాతం పన్ను విధించింది.

దీనిని వినియోగదారుడే నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి. లేదంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2019లో ఈ పన్నుపై రూ.900 కోట్లు వసూలు చేసింది కేంద్రం. ఈ ఏడాది దీనిని సవరించిన ఎటువంటి ఆదాయంపైన అయినా రెండు శాతం డిజిటల్ సర్వీసు పన్ను చెల్లించాలని కేంద్రం చట్టం చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం పరిధిలోకి బిజినెస్ టూ కస్టమర్ కంపెనీలను తీసుకొచ్చింది. కస్టమర్ల నుంచి కంపెనీలే పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. 

భారతదేశంలోని అమెరికా కంపెనీలు ఈ సరికొత్త పన్నుపై అసంత్రుప్తిగా ఉన్నాయి. ఈ సంగతి అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ వద్దకు చేరింది. దీంతో భారతదేశంతోపాటు 9 దేశాలపై అమెరిక దర్యాప్తు చేపట్టింది. ఈ పన్ను ఎంత వరకు నిర్హేతుకం అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios