భార్యకు విడాకులు ఇచ్చేసిన గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్..ఎలాన్ మస్క్‌తో ఉన్న ఆ రిలేషనే కారణమా..?
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ నికోల్ షానహాన్‌కు విడాకులు ఇచ్చాడు. తన భార్య నికోల్ కు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో రిలేషన్ ఉందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ విడాకులు తీసుకోవడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తన భార్య, న్యాయవాది, వ్యాపారవేత్త నికోల్ షానహన్‌కు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నికోల్ షానహాన్‌తో ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తో రిలేషన్ గురించి పలు కథనాలు వెలువడిన నేపథ్యంలో సెర్గీ తన భార్య నికోల్ కు విడాకులు ఇవ్వడంతో సంచలనంగా మారింది. సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ షానహన్‌కు విడాకులు ఇచ్చాడని పేజ్ సిక్స్ వెబ్ పోర్టల్ రిపోర్ట్ చేసింది. నిజానికి వీరి విడాకులు గత నెల 26న కోర్టులో ఖరారయ్యాయి.
తమ కుమార్తె కస్టడీ కోసం ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు.
సెర్గీ బ్రిన్ , నికోల్ షానహాన్ నుండి చట్టబద్ధమైన విడాకులు తీసుకున్న తరువాత, వారు ఇప్పుడు తమ 4 ఏళ్ల కుమార్తె సంరక్షణను తమ మధ్య నిర్ణయించుకోవాల్సి ఉంది. అయితే నికోల్ విడాకులను వ్యతిరేకించలేదు, బదులుగా కోర్టులో తన జీవిత భాగస్వామి విడాకుల పిటిషన్‌కు మద్దతుగా నిలిచింది.
వీరిద్దరూ 2015లో తొలిసారి డేటింగ్ చేయడం గమనార్హం. అదే సంవత్సరం, బ్రిన్ తన మొదటి భార్య అన్నే వోజికికి విడాకులు ఇచ్చాడు. 2018లో నికోల్ షానహన్‌ను వివాహం చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. సరిదిద్దలేని విభేదాలను పేర్కొంటూ సెర్గీ బ్రిన్ విడాకుల కోసం దాఖలు చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, ఎలాన్ మస్క్‌తో సంబంధం ఉందని ఆరోపణలు వినిపించిన ఒక నెల తర్వాత అతను విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, మస్క్, షానహన్ ఇద్దరూ తమ సంబంధాన్ని ఖండించారు.
ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..?
సెర్గీ, నేను స్నేహితులం తరచూ పార్టీల్లో కలిసేవాళ్లం. నేను అతడితో ఉన్న సమయంలో నికోల్‌ను రెండుసార్లు మాత్రమే చూశాను. మా ఇద్దరి మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ లేవని ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు.
నికోల్ వాదన ఇదే..?
దీనిపై నికోల్ షానహన్ స్పందిస్తూ నాకు ఎలాన్ మస్క్ మధ్య ఎలాంటి ఎఫైర్లు లేవు. అయినప్పటికీ, ది వాల్ స్ట్రీట్ జర్నల్ వారు మా సోర్సింగ్‌ను విశ్వసించలేదని , మా రిపోర్టింగ్ పట్ల వారు పక్షపాతంతో ఉన్నారని పేర్కొంది.
బ్రిన్ 118 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉన్నాడు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ 118 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. నికోల్ షానహన్ కాలిఫోర్నియాకు చెందిన న్యాయవాది ఆమె బీ-ఎకో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా ఉన్నారు.