గ్యాస్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. తగ్గిన సిలిండర్ ధర.. ఇప్పుడు ఎంతంటే..?

వాణిజ్య సిలిండర్ ధర రూ.19 తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రూ.1745.50. గతంలో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1764.50గా ఉంది. ధరల తగ్గింపు తర్వాత కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1859, ముంబైలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా  ఉంది. 
 

good news  to gas customers; 19kgs LPG commercial cylinder price decrease-sak

న్యూఢిల్లీ (మే 1): ఎల్‌పిజి సిలిండర్ ధర ప్రతి నెలా ఒకటో తేదీన సవరిస్తుంటారు. దీని ప్రకారం మే మొదటి రోజైన ఈరోజు వాణిజ్య సిలిండర్ ధర తగ్గింది. 2024 లోక్‌సభ ఎన్నికల మధ్య ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్  LPG గ్యాస్ సిలిండర్ల ధరలను బుధవారం సవరించాయి. తాజా ధరల సవరణ ప్రకారం మే 1 నుంచి అమలులోకి వచ్చేలా 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.19  తగ్గించబడింది. గత నెలలో కూడా 19 కిలోల ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర  తగ్గింపు జరిగింది. అలాగే 5కిలోల ఎఫ్‌టిఎల్ సిలిండర్ ధర రూ.7.50 తగ్గింపు చేసింది.

వాణిజ్య సిలిండర్ ధర రూ.19 తగ్గింపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రూ.1745.50. గతంలో ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1764.50గా ఉంది. ధరల తగ్గింపు తర్వాత కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1859, ముంబైలో రూ.1698.50, చెన్నైలో రూ.1911గా  ఉంది. 

స్థిరంగా డొమెస్టిక్ సిలిండర్ ధర 
వాణిజ్య సిలిండర్ ధరలో తగ్గింపు ఉండగా, డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గతేడాది ఆగస్టు నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి సవరణ జరగలేదు. ప్రస్తుత ధరలో  తేడా లేదు.  

మార్చి 1న 19 కిలోల ఎల్‌పిజి కమర్షియల్ సిలిండర్ ధర రూ.25,  ఫిబ్రవరి నెలలో వాణిజ్య సిలిండర్ ధరలో రూ.14 పెంపుదల జరిగింది. దీనికి ముందు, అంటే 2024 ప్రారంభంలో, కొత్త సంవత్సరం నాడు వాణిజ్య సిలిండర్ ధర రూ. 39.50 తగ్గింపు జరిగింది. 

ప్రతి నెల ప్రారంభంలో, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ LPG సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఎల్‌పిజి సిలిండర్ ధరను అంతర్జాతీయ ధర అంచనా ఆధారంగా ప్రతి నెలా మొదటి రోజున సవరిస్తారు. 

నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో వరుసగా మూడు నెలలు తగ్గుతూ వచ్చిన వాణిజ్య సిలిండర్ ధర ఫిబ్రవరి నుంచి పెరగడం మొదలైంది. అయితే మార్చి, ఏప్రిల్‌లో తగ్గుదల కనిపించింది. అయితే, ఈ తగ్గుదలకు కారణం వెల్లడించలేదు. దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలు కొనసాగుతున్న నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గడం వినియోగదారులకు సంతోషాన్ని కలిగించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య హోటళ్ల వ్యాపారులు, వాణిజ్య సిలిండర్లు వినియోగించే వినియోగదారులకు సంతోషం కలిగించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios