అక్షయ తృతీయ నాడు బంగారం షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాలా మంది ఈ రోజున వారి సామర్థ్యం ప్రకారం పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే, గ‌త కొన్ని నెల‌లుగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు వినియోగ‌దారుల‌కు భారంగా మార‌వ‌చ్చు. 

అక్షయ తృతీయ రానుండటంతో కొనుగోళ్ల సందడి నెలకొంది. అయితే, ప్రస్తుత సమయంలో పసిడి ధరలు తార స్థాయికి చేరుకోవడం కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ ఏడాది కొనుగోలు 20 శాతం తగ్గే అవకాశం ఉందని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. 

అక్షయ తృతీయ నాడు బంగారం షాపింగ్ చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చాలా మంది ఈ రోజున వారి సామర్థ్యం ప్రకారం పసిడిని కొనుగోలు చేస్తారు. అయితే, గ‌త కొన్ని నెల‌లుగా పెరిగిన బంగారం వెండి ధ‌ర‌లు వినియోగ‌దారుల‌కు భారంగా మార‌వ‌చ్చు. 

నేడు 21 ఏప్రిల్ 2023న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబైలో బంగారం ధరలు తగ్గాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 56,000, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 230 పతనంతో రూ. 61,080 వద్ద ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ. 150 తగ్గుదలతో రూ.56,500 వద్ద ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పతనంతో రూ. 61,640. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 60,930. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850, 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.60,930. వెండి ధరలు కోల్‌కతా, ముంబైలలో రూ.77,400, చెన్నైలో వెండి ధర రూ. 81,000.

 మరోవైపు బంగారం ధరలు హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కూడా తగ్గాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పతనంతో రూ. 55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 60,930. హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 200 పతనంతో రూ. 55,850, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పతనంతో రూ. 60,930.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,930. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 55,850, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,930. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 81,000.

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబర్ నుంచి దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

“గత నెల రోజుల నుండి, వివాహాల కోసం సాధారణ కొనుగోలు కూడా ఆగిపోవడాన్ని మేము చూస్తున్నాము. ఇందుకు అధిక ధర ఒక్కటే కారణం. ధరలు కాస్త తగ్గుతాయనే ఆశతో చాలామంది బంగారం కొనుగోలు ప్లాన్‌లకు బ్రేక్‌లు వేస్తున్నారు. పెళ్లి తేదీలు దగ్గర పడుతుండటంతో బంగారం కొనేందుకు జనం వస్తున్నారని పూణే ప్రధాన కేంద్రంగా ఉన్న జ్యువెలర్స్ చైన్ PN గాడ్గిల్ అండ్ సన్స్ CEO అమిత్ మోదక్ అన్నారు.