ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,680గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,450గా ఉంది. చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660, 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 వద్ద ట్రేడవుతోంది.
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గి 24 క్యారెట్ల బంగారం రూ.50,680 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 130 తగ్గి రూ. 46,450 వద్ద ట్రేడవుతోంది.
ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,680గా ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,450గా ఉంది. చెన్నైలో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,660, 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,680 ఉంది.
మరోవైపు ఈ రోజు వెండి ధర గురించి మాట్లాడితే వెండి ధర కూడా తగ్గింది. ఈరోజు ఒక గ్రాము వెండి ధర రూ.60 ఉండగా, నిన్న దాని ధర రూ.60.80గా ఉంది. ఒక కిలో వెండి కడ్డీ ధర నేడు రూ.60,000 కాగా, నిన్న రూ.60,800. అంటే కిలో వెండి ధర కూడా రూ.800 తగ్గింది.
చెన్నైలో కిలో వెండి ధర రూ.60 వేలు ఉండగా, ముంబైలో రూ.54,600 ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.54,600, కోల్‌కతాలో రూ.54,600, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60 వేలు.
22 అండ్ 24 క్యారెట్ బంగారం మధ్య తేడా
24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారంలో 9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను కలపడం ద్వారా ఆభరణాలను తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే, 24 క్యారెట్లతో బంగారు ఆభరణాలు చేయలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారాన్ని విక్రయిస్తారు.
