బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 3000 పతనం అయ్యింది. దీంతో భవిష్యత్తులో పసిడి ధర రూ.50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఇదే సరైన సమయం ఎందుకంటే, బంగారం ధర గడచిన 15 రోజులుగా గమనించినట్లయితే వరుసగా పడుతూ వస్తోంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర ఏకంగా 3000 రూపాయలు పతనమైంది. బంగారం తన ఆల్ టైం రికార్డ్ స్థాయితో పోల్చి చూసినట్లయితే, ప్రస్తుతం రూ. 55 వేల సమీపంలో ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు 3 వేల రూపాయలు తగ్గడం విశేషం. బంగారం ధర ఇదే రేంజ్ లో పతనమైతే త్వరలోనే 50,000 దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదే కనుక నిజమైతే ఇక పసిడి మార్కెట్ పసిడి ప్రియులకు నిజంగా పండగే అని చెప్పాలి. బంగారం ధర గమనించినట్లయితే గడచిన ఐదు సంవత్సరాలలో భారీగా పెరిగింది ముఖ్యంగా కరోనా నేపథ్యంలో బంగారం 10 గ్రాముల 24 క్యారట్ల ధర రూ. 35000 నుంచి రూ. 58 వేల వరకూ పెరిగింది. బంగారం చరిత్రలోనే ఈ స్థాయిలో పెరగడం తొలిసారి అని చెప్పాలి ఎందుకంటే గడచిన 20 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం వరకు బంగారం ధర నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. 2000 సంవత్సరంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 4000 ఉంటే 2018 సంవత్సరానికి రూ.35 వేలు అయ్యింది. అయితే ఒక్కసారిగా కరోనా పుంజుకోవటంతో మార్కెట్లో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది పెట్టుబడులన్నీ కూడా బంగారం వైపే తరలి వెళ్లాయి. ఫలితంగా బంగారం ధర ఒక్కసారిగా అర లక్ష దాటిపోవడం విశేషం. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్ లో బంగారానికి డిమాండ్ నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో ఔన్స్ బంగారం ధర 1820 డాలర్లకు పడిపోయింది. అంతేకాదు బంగారం ప్రస్తుతం డాలర్ నుంచి విపరీతమైన పోటీని ఎదుర్కొంటుంది ఫలితంగా బంగారం ధర గరిష్ట స్థాయి నుంచి గమనించినట్లయితే తగ్గుతూ వస్తోంది. ఇదే కొనసాగితే బంగారం ధర భారీగా పతనం అయ్యే అవకాశం ఉంది. 

 మరోవైపు యూరప్ మార్కెట్లో కూడా ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టడంతో అత్యధిక బంగారు నిల్వలు ఉన్నటువంటి జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు అంతమ అపారమైన పాండాగారం నుంచి బంగారం నిలువలను ఓపెన్ మార్కెట్లో విక్రయించే అవకాశం ఉంది తద్వారా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే కనుక జరిగితే బంగారం ధర మరోసారి తులం 50 వేల దిగువకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.యూరప్ మార్కెట్ ఇంకా మాంద్యం బారిన పడలేదు. మాంద్యం తీవ్రతను అయ్యేకొద్దీ బంగారం ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.