బంగారం ధర నేడు 230 రూపాయలు పెరిగింది. బుధవారం బంగారం ధరలు రూ.62,000 మార్కు సమీపంలోకి చేరాయి. ఈ నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి.
బంగారం ధరలు గురువారం కూడా రికార్డు స్థాయిలను తాకాయి ముఖ్యంగా బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.61,150 గా ఉంది. మంగళవారంతో పోల్చితే బంగారం ధర 230 రూపాయలు పెరిగింది. అయితే బంగారం ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా గడచిన నెల రోజులుగా గమనిస్తే బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా బంగారం ధర అంతర్జాతీయంగా కూడా భారీగా పెరిగింది.
ప్రస్తుతం అమెరికాలో బంగారం ధర 2000 డాలర్లు దాటింది. ఈ ప్రభావం కూడా దేశీయంగా బంగారం రేట్ లపై పడుతుంది. . మరో మూడు రోజుల్లో అక్షయ తృతీయ రాబోతోంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేయాలని ఆశిస్తుంటారు. కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో బంగారు నగల సేల్స్ భారీగా పెరగనున్నాయి.
ముఖ్యంగా మహా నగరాల్లోనూ పట్టణాల్లోనూ బంగారు కాయిన్స్ కొనేందుకు జనం నగల షాపులపై దండెత్తే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కూడా లేకపోవడంతో పెద్ద ఎత్తున షాపింగ్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నగల షాపుల వాతం పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రారంభించారు వేస్టేజీ చార్జీలను తగ్గిస్తామని మేకింగ్ చార్జీలు తీసుకోమని, భారీ డిస్కౌంట్ ఇస్తామని ఇలా రకరకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
మరోవైపు బంగారం ధరలు అటు అంతర్జాతీయంగా కూడా భారీగా పెరగడం వెనక అమెరికాలోని ద్రవయోల్బణం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అలాగే వరుస బ్యాంకింగ్ సంక్షోభాలు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థను కుంగుబాటుకు గురి చేస్తున్నాయి ఫలితంగా మధుపరులు బంగారంపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు బంగారం అనేది ఎప్పటికైనా ఒక సేఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. అందుకే మదుపుదారులు పెద్ద ఎత్తున బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
మీరు కూడా బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకుంటే… కేవలం ఫిజికల్ బంగారం కొనుగోలు చేయడం కాదు. బంగారంపై జారీ చేసే బాండ్లను సైతం కొనుగోలు చేయడం ద్వారా మీరు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించే వీలుంది కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరింగ్ బాండ్స్ కొనుగోలు చేస్తే మీకు వడ్డీ కూడా వస్తుంది. బంగారం బాండ్లు, అలాగే బంగారం ఈటీఎఫ్ బాండ్లు రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది.
బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మదుపరులు మంచి ఆదాయం పొందే వీలుంది. భవిష్యత్తులో కూడా బంగారం ధర ఒక తులం లక్ష వరకు చేరే వీలుందని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఎంపిక అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
