భారత మార్కెట్లలో బంగారం, వెండి ధరలు నిన్నమొన్నటిదాకా పరుగందుకున్నాయి. మంగళవారం నాడు 10 గ్రాముల పసిడి ధర ఢిల్లీలో రూ.1,182 ఎగిసి  రూ.54,856ను చేరింది. అదే సోమవారం రోజున రూ.53,674 వద్ద నిలిచింది.

నేడు ఎం‌సి‌ఎక్స్ లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముకు 0.5% పడిపోయి రూ.53,313కు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.8% క్షీణించి వెండి కిలోకు రూ.68,938 కు చేరుకుంది. అంతకుముందు బంగారం ధర 10 గ్రాములకు 1,300, వెండి కిలోకు 2,100 పెరిగింది.

స్పాట్ బంగారం  ఔన్సుకు 0.1% పెరిగి 2,002.12 డాలర్లను  వద్ద ఉంది. గ్లోబల్‌ మార్కెట్‌లో ఇతర విలువైన లోహాలలో వెండి ఔన్స్‌కు 0.6% పెరిగి 27.82 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం 0.2% పెరిగి 958.33 డాలర్లకు చేరుకుంది.

also read ఆన్‌లైన్‌ ఫార్మసీని ప్రారంభించిన అమెజాన్‌.. అది చట్టవిరుద్ధమని పీఎంఓకు లేఖ.. ...

డాలర్ ఇండెక్స్ ఆరవ వరుస సెషన్‌కు రెండేళ్ల కనిష్టానికి పడిపోయింది. బలమైన వాల్ స్ట్రీట్ సెషన్ తర్వాత ఎస్&పి 500 ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకిన తరువాత బంగారం లాభాల బాటలో పయనిస్తోంది.

భారతీయ మార్కెట్లలో బంగారం ధర ఈ సంవత్సరం దాదాపు 40% పెరిగింది, ప్రపంచ రేట్ల ర్యాలీని యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించింది. పెరుగుతున్న డిమాండ్, కరోనావైరస్ వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలకు కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు మద్దతునిస్తాయనే అంచనాలు బంగారం ధరలను రికార్డు స్థాయికి నెట్టాయి.

ఆగస్టు 7న బంగారం భారతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలో 56,191 ను తాకింది. హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి, ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి. ఈ రోజు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,680.  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారు ధర రూ.56,370.