బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల ప్రభావం చూపించడంతోపాటు.. దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. దీంతో.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. వెండి ధర అయితే.. ఒక్క రోజే రూ.600పెరిగింది.

శుక్రవారం నాటి మార్కెట్లో పసిడి ధర రూ.32,500 మార్క్ ని దాటింది. రూ.170 పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.32,620కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. రూ.600 పెరిగి కేజీ వెండి ధర రూ.39,250కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,278.10 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.26 డాలర్లు పలుకుతోంది.