Asianet News TeluguAsianet News Telugu

పసిడి ప్రియులకు అలెర్ట్.. బంగారం కొనేముందు నేడు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

భారతదేశంలో బంగారం ధరలు సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, స్థానిక డిమాండ్ ఇంకా సప్లయ్  డైనమిక్స్‌తో సహా వివిధ కారకాలచే ప్రభావితమవుతాయి.
 

Gold Prices In India Remain Above Rs 60,000: Check Latest Gold Rates In Your City here-sak
Author
First Published Jun 3, 2023, 10:24 AM IST

 భారతదేశంలో శనివారం కూడా అనేక నగరాల్లో బంగారం ధరలు 24 క్యారెట్లకు రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.61,250గా ఉంది.  22 క్యారెట్ల 10 గ్రాముల  ధర రూ.56,150. మరోవైపు కిలో వెండి ధర రూ.73,400గా ఉంది.  

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.61,150, , 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.56,050గా ఉన్నాయి.  ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.61,100, 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ.56,000గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 190 పెరుగుదలతో  రూ. 56,390, 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 200 పెంపుతో రూ. 61,950. 

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000 మరియు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 61,100. కోల్‌కతా, ముంబైలలో కేజీ వెండి ధర రూ.73,400, చెన్నైలో వెండి ధర రూ. 78,600

భారతదేశంలో బంగారం ధరలు సాధారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం రేట్లు, కరెన్సీ హెచ్చుతగ్గులు, స్థానిక డిమాండ్ ఇంకా సప్లయ్  డైనమిక్స్‌తో సహా వివిధ కారకాలచే ప్రభావితమవుతాయి.

2021-22లో పసిడి దిగుమతులు USD 46.2 బిలియన్లుగా ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 6.12 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $1947.90 డాలర్ల వద్ద, స్పాట్ సిల్వర్  ఔన్సుకు $23.64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ.82.428 మార్క్ వద్ద ట్రేడవుతోంది.

ఈరోజు  హైదరాబాద్ , బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో పెరిగాయి. ప్రముఖ నగరాల్లో  పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెంపుతో  రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 340 పెంపుతో రూ. 61,100. 

హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 300 పెంపుతో రూ. 56,000 , 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ. 340 పెంపుతో రూ. 61,100.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 56,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,100.

మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 78,600గా ఉంది. 

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు ముగుస్తాయి అలాగే  ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని, బంగారం ధర హెచ్చుతగ్గులకు అనేక కారణాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios