గత కొంతకాలంగా బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. తాజాగా బంగారం, వెండి దిగుమతుల పై  సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగోచ్చింది.

నేడు బంగారం 10 గ్రాములకు రూ.480 తగ్గి రూ .47,702 కు చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.48,182 వద్ద ముగిసింది. 

మరో వైపు వెండి ధర ఒక్కరోజే భారీగా పడిపోయింది. నేడు వెండి  కిలోకు  రూ.3,097 తగ్గి 70,122 రూపాయలకు చేరింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో వెండి కిలోకు 73,219 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం  ఔన్స్‌కు 1,847 డాలర్లు, వెండి ఔన్సుకు 27.50 డాలర్లుగా ఉంది. 

ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశంలో బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని తగ్గింస్తున్నట్లు  ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు . ఈ చొరవ కారణంగా, ఈ విలువైన లోహాల ధరలు దేశీయ మార్కెట్లో సానుకూలంగా ఉంటాయి అలాగే రత్నాలు, ఆభరణాల ఎగుమతి కూడా పెరుగుతుంది.

కేంద్ర బడ్జెట్ 2021-22లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 'బంగారం, వెండిపై 12.5 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఉంది. జూలై 2019 లో సుంకం 10 శాతానికి పైగా పెంచినప్పటి నుండి విలువైన లోహాల ధరలు బాగా పెరిగాయి. బంగారం, వెండి ధరలను మునపటి స్థాయికి తీసుకురావడానికి, మేము వాటి పై కస్టమ్స్  సుంకం  తగ్గిస్తున్నాము. '  అని అన్నారు.

 బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌లో ప్రకటించారు. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ (కమోడిటీ రీసెర్చ్) నవనీత్ దమాని మాట్లాడుతూ బడ్జెట్‌లో సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించే ప్రకటన బంగారం ధరలు తగ్గడానికి దారితీసిందని అన్నారు. ఇటీవల బంగారం ధరలు పెరగడం, స్మగ్లింగ్, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకొని ఉండొచ్చు అని తెలిపారు.

 బంగారు మిశ్రమం (గోల్డ్ డోర్ బార్) పై సుంకాన్ని 11.85 శాతం నుండి 6.9 శాతానికి, వెండి మిశ్రమం (సిల్వర్ డోర్ బార్) పై 11 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించారు. ప్లాటినంపై సుంకం 12.5 శాతం నుండి 10 శాతానికి, విలువైన లోహ నాణేలపై 12.5 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు.