గతంలో 24 క్యారెట్ల తులం ధర రూ.56 వేలకు చేరి అల్ టైమ్ హై రికార్డ్ ధరకు చేరగా, ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేసి రూ.60 వేలకు చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆలోచనలో పడిపోతున్నారు.   

ఎలాంటి శుభకార్యాలైన, పండగలైన మహిళలు బంగారం ధరించేందుకు ఎక్కువ ఇష్టపడతారు. అంతేకాదు బంగారం కొనుగోళ్లను మంచిదిగా కూడా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకరోజు తగ్గుతూ మరోకరోజు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉండగా రానున్న పెళ్లిళ్ల సీజన్ లో బంగారం కొనేందుకు చూస్తున్న వారికి షాకిస్తున్నాయి పసిడి ధరలు.

గతంలో 24 క్యారెట్ల తులం ధర రూ.56 వేలకు చేరి అల్ టైమ్ హై రికార్డ్ ధరకు చేరగా, ప్రస్తుతం ఆ రికార్డును బ్రేక్ చేసి రూ.60 వేలకు చేరింది. దీంతో పసిడి ప్రియులు కొనేందుకు ఆలోచనలో పడిపోతున్నారు.

హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ ప్రకారం, బలమైన అంతర్జాతీయ ధోరణుల మధ్య బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,080 జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో పసిడి ధర 10 గ్రాములకు రూ.60,055 వద్ద స్థిరపడింది.

ఢిల్లీ మార్కెట్‌లో స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,025 పెరిగి రూ.61,080 వద్ద ట్రేడవుతున్నాయి.

దేశీయ మార్కెట్‌లో చూస్తే బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 61,000 స్థాయిని దాటి తాజా జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

విదేశీ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు USD 2,027, వెండి ఔన్స్‌కు USD 24.04 వద్ద ఉన్నాయి. కామెక్స్ గోల్డ్ ధరలు బుధవారం ఆసియా ట్రేడింగ్ గంటలలో ర్యాలీ చేశాయి, US ఉద్యోగ అవకాశాలు అంచనా కంటే తక్కువగా ఉన్న డేటా మధ్య మార్చి 2022 నుండి 1.80 శాతానికి పైగా పెరిగాయి.

గ్లోబల్ ఎకానమీలో కొనసాగుతున్న అనిశ్చితులు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి మద్దతుగా కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీస్ హెడ్ హరీష్ వి అన్నారు.

సీజనల్ సేల్స్ అండ్ వచ్చే నెలలో రానున్న అక్షయ తృతీయ వంటి పండుగల కోసం డిమాండ్ ధరలకు గట్టి మద్దతునిస్తుందని హరీష్ తెలిపారు.

హైదరాబాద్ లో పెళ్లిళ్ల సీజన్‌కు ముందు బంగారం ధర ఆరు నెలల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది. బుధవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారంతో పోలిస్తే రూ.1,030 పెరిగి రూ.61,360కి చేరింది.

ఇదిలా ఉండగా బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,350గా ఉంది, ధరలు చూస్తే రూ. 950 పైకి ఎగబాకింది. బంగారం ధర ఇంత పెరగడం ఒక్కసారి మాత్రమే కాదు, రాబోయే కాలంలో రూ.65,000కు చేరుకోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు నిపుణులు. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతుండడంతో ధరలు మరింత పెరుగుతాయనే ఆలోచనతో చాలా మంది బంగారం కొనుగోలుకు ఎగబడుతున్నారు.