Asianet News TeluguAsianet News Telugu

బంగారం ధరల అప్ డేట్: కొనుగోలుదారులకు మంచి ఛాన్స్.. నేడు తులం ధర ఎంతంటే..?

ఈ రోజు ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 54,330,  22 క్యారెట్ల ధర రూ. 49,800 వద్ద ఉంది.

Gold and silver rates today unaltered in Hyderabad Bangalore Kerala Visakhapatnam  13 December 2022
Author
First Published Dec 13, 2022, 11:37 AM IST

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధరలు పడిపోయి పది గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ.54,330 వద్ద ట్రేడవుతున్నాయి. మరోవైపు వెండి ధర నేడు రూ.90 పెరిగి కిలో రూ.69,000 వద్ద ట్రేడవుతోంది.

ఒక నివేదిక ప్రకారం, ఈ రోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.49,800 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, కేరళ అండ్ పుణెలలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 54,330,  22 క్యారెట్ల ధర రూ. 49,800 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల ధర  రూ.54,490.  22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ధర  రూ.55,040, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 వద్ద ట్రేడవుతోంది.

15.29 pm ET (2029 GMT) సమయానికి స్పాట్ బంగారం 0.9 శాతం తగ్గి ఔన్స్‌కు $1,780.19 డాలర్ల వద్ద ఉంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం తగ్గి $1,792.30 వద్ద స్థిరపడ్డాయి. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.7 శాతం తగ్గి 23.30 డాలర్లకు చేరుకుంది. 

22 క్యారెట్ల అలాగే 24 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?

24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది, 22 క్యారెట్ దాదాపు 91% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారానికి  9% రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలు కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైనది అయితే  ఆభరణాలుగా  తయారు చేయడం సాధ్యం కాదు.  

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?
బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్కులు ఇస్తారు. 24 క్యారెట్లపై 999, 23 క్యారెట్లపై 958, 22 క్యారెట్లపై 916, 21 క్యారెట్లపై 875, 18 క్యారెట్లపై 750 ఉంటుంది. చాలా వరకు బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తున్నారు. క్యారెట్ ఎంత ఎక్కువ ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉంటుందని చెబుతారు.

Follow Us:
Download App:
  • android
  • ios