మంగళవారం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఎంత ధర ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది. తాజాగా దేశీయంగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట. పసిడి రేటు పడిపోయింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు మంగళవారం (మార్చి 29, 2022) మాత్రం నేలచూపులు చూపింది. పసిడి రేటు పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా దిగొచ్చింది. సాధారణంగా అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారంపై ప్రభావం చూపిస్తుంటాయనేది తెలిసిందే. అదే సమయంలో రెండు దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం, వెండితో సహా అన్ని ఇతర అంశాలపై పెను ప్రభావం చూపిస్తుంటుంది. బంగారం అందుకే గత కొద్దిరోజులుగా పెరుగుతోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ. 52,310కు వచ్చింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ. 47,950కు దిగొచ్చింది. బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 700 పడిపోయింది. వెండి ధర రూ. 72,700కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,550గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,950 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,310గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,160 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,650గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 52,310గా ఉంది.
వెండి ధరలు
ఇక బంగారం లాగే వెండి ధర రూ. 700 పడిపోయింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.68,400 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, కోల్‌కతాలో రూ.68,400 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,700 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.72,700 వద్ద కొనసాగుతోంది. ఇకపోతే.. హైదరాబాద్‌లో రూ.72,700 వద్ద ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా,.. విశాఖపట్నంలో కూడా ఇదే ధర ఉంది.
