బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్‌. బంగారం ధ‌ర‌ పడిపోయింది. ప‌సిడి బాటలోనే వెండి ధ‌ర‌ కూడా పయనించింది. గ్లోబల్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధ‌ర‌లు పైకి కదిలాయి. 

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. బంగారం ధ‌ర‌లు పడిపోయాయి. నిన్న దూసుకుపోయిన బంగారం ధర గురువారం (మార్చి 24, 2022) మాత్రం నేలచూపులు చూస్తోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. వెండి ప్రియులకు ఇది మంచి ఛాన్స్. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర త‌గ్గింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పడిపోయింది. దీంతో నేడు బంగారం ధ‌ర‌ రూ. 51,670కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి రేటు రూ.400 తగ్గుదలతో రూ. 47,350కు చేరింది. బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1500 పతనమైంది. దీంతో వెండి ధ‌ర‌ రూ. 71,900కు దిగి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 ఉండ‌గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,670గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350గా ఉంది. అటు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,670గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,810 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,160గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,350 రూపాయలుంటే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,670గా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 47,350 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 51,670గా ఉంది.

వెండి ధరలు

ఇక బంగారం లాగే వెండి కూడా త‌గ్గుముఖం ప‌ట్టింది. దేశీయంగా కిలో వెండిపై రూ. 1500లకుపైగా త‌గ్గింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, ముంబైలో రూ.67,600గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600గా ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, కేరళలో రూ.71,900 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.71,000గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.71,900 ఉండగా, విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధ‌ర కొన‌సాగుతోంది.