నేడు గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050, అంటే నిన్నటి ధరతో పోలిస్తే రూ.200 పెరిగింది. 

మరో రెండు రోజుల్లో అక్షయ తృతీయ రాబోతుంది, ఈ రోజున బంగారం కొనేందుకు అందరు ఆసక్తి చూపిస్తారు. అయితే నేడు గురువారం బంగారం, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050, అంటే నిన్నటి ధరతో పోలిస్తే రూ.200 పెరిగింది. 

 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,150 – బుధవారం నాటి ధర రూ.60,920. భారతదేశంలో రెండు రకాల బంగారం వ్యాపారం జరుగుతుంది, 24K అండ్ 22K. దీని ప్రకారం, ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,310.

చెన్నైలో ఈరోజు బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు)కు రూ.61,800 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు)కు రూ.56,650.

కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 61,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 56,050. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.61,150 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,050గా ఉంది.

భువనేశ్వర్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 61,150 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,050. వెండి ధరల విషయానికొస్తే, 10 గ్రాముల వెండి ధర ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో రూ.776. 

హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో కూడా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. ప్రముఖ నగరాల్లో పసిడి ధరల ప్రకారం, బెంగళూరు నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెంపుతో రూ. 56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 230 పెంపుతో రూ. 61,150. హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ. 200 పెంపుతో రూ. 56,050, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 230 పెంపుతో రూ. 61,150. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,150. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,050, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,150. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 81,000.

"బంగారాన్ని కొనుగోలు చేయడానికి శుభ సందర్భంగా భావించే అక్షయ తృతీయకు ముందు ధరలలో తాజా సవరణల తర్వాత దేశీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంది" అని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.