Asianet News TeluguAsianet News Telugu

Gold And Silver Price Today: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌.. వెండి ధ‌ర‌లు మాత్రం..!

పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి.
 

Gold And Silver Price Today
Author
Hyderabad, First Published May 15, 2022, 8:51 AM IST

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు నిన్నటితో పోలిస్తే నేడు కాస్త తగ్గింది. పది గ్రాములకు రూ.200 తగ్గింది. నిన్న, ఈరోజు రెండు రోజులు కలుపుకుంటే మొత్తంగా సుమారు వెయ్యిరూపాయల వరకు తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.300 పెరిగింది. 

తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.46,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,450గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.63,700 అయింది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (మే 15, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!  

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,450గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,370 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,670గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,250 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.50,450 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.46,250 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,450గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.46,250 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.50,450గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 59,400 ఉండగా, ముంబైలో రూ.59,400గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, కోల్‌కతాలో రూ.59,400గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, కేరళలో రూ.63,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.63,700 ఉండగా, విజయవాడలో రూ.63,700 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios