అంతర్జాతీయంగా డాలర్ బలపడే కొద్ది మార్కెట్లో బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి ఇప్పటికే పసిడి ధరలు రికార్డు స్థాయి అయినటువంటి 58 వేల నుంచి క్రమంగా 56 వేల రూపాయల దిగువకు వచ్చేసింది దీంతో ఆభరణాల షాపింగ్ చేసేవారికి ఊరట కలిగించింది.
మార్కెట్లో బంగారం ధరలు రోజురోజుకీ పతనం అవుతున్నాయి. దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లకు ఈ పరిణామం శుభవార్త అనే చెప్పాలి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే గత రెండు నెలలుగా మనం చూసినట్లయితే బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఏకంగా ఒక తులం బంగారం 58 వేలకు తాకింది. అయితే ఆ స్థాయి నుంచి ప్రస్తుతం 56,000 దిగువకు దిగింది. గడచిన పది రోజులుగా మనం గమనించినట్లయితే బంగారం ధర దాదాపు రెండు వేలకు పైగా తగ్గింది. మీరు నగల షాపింగ్ కోసం ప్లాన్ చేస్తున్నట్లయితే, ప్రస్తుతం బంగారం తక్కువ ధరకే లభిస్తోంది. కావున ఇప్పుడే కొనుగోలు చేస్తే కాస్త డబ్బు మీకు కలిసి వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే భవిష్యత్తులో మాత్రం బంగారం ధర మరింత పెరిగే ఛాన్స్ ఉందని కావున ఎవరైనా ఎక్కువ మొత్తంలో బంగారం కొనాలి అనుకుంటే, ఇప్పుడే కొనుగోలు చేయాలని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా శనివారం రోజు బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర రూ.250 తగ్గింది. మహాశివరాత్రి (ఫిబ్రవరి 18) పర్వదినాన 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 56,180 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 51,460గా ఉంది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో హెచ్చుతగ్గులను నమోదు చేశాయి. ఈరోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.56,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.51,500గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,660 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 51,950. విజయవాడలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 56,510 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 51,800. మరోవైపు వైజాగ్ లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.56,510 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.51,800గా ఉంది. ఏపీలోని నెల్లూరులో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 56,510 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.51,800. గత 24 గంటల్లో ధరలు రూ.220 తగ్గాయి.
అంతర్జాతీయంగా చూసినట్లయితే అమెరికాలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు (సుమారు 31 గ్రాములు) 1,840.86 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా డాలర్ ధర రోజురోజుకు పెరుగుతోంది దీంతో బంగారం పై ఎఫెక్ట్ పడుతుంది ఫలితంగా భవిష్యత్తులో బంగారంలో మరింత క్షీణత ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
