కరోనా సంక్షోభం మధ్య, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 జూలై-సెప్టెంబర్ రెండవ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం క్షీణించింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో జిడిపి 4.4 శాతం పెరిగింది.  

కరోనావైరస్ మహమ్మారి, దాని నివారణకు 'లాక్ డౌన్' కారణంగా ఏప్రిల్-జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ 23.9 శాతం క్షీణతతో భారీగా పతనమైంది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 23.9 శాతంతో భారీ క్షీణతను చవిచూసింది.

మొదటి త్రైమాసికంలో మొదటి రెండు నెలలు ఏప్రిల్, మే నెలల్లో దేశం మొత్తం  పూర్తి లాక్ డౌన్ విధించింది. కార్యకలాపాలు, రాకపోకలు మే చివరలో తిరిగి ప్రారంభమయ్యాయి. రెండవ త్రైమాసికంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ తేరుచుకుంది.

సాంకేతికంగా దేశం ఆర్థిక మందగమనంలో చిక్కుకుందని తెలిపింది, అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో జిడిపి వరుసగా రెండవసారి క్షీణించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి రేటు 4.9 శాతంగా ఉండడం గమనార్హం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 3.2 శాతం పెరిగింది.

also read ఆనాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటు రతన్‌ టాటా భావోద్వేగం​.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్.. ...

జిడిపి పతనానికి సంబంధించి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కె.వి.సుబ్రమణియన్, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కరోనా మహమ్మారి ప్రభావాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. మూడవ త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం మితంగా ఉంటుందని ఆయన అన్నారు.

అయితే జూన్ త‌ర్వాత మెల్ల‌గా లాక్‌డౌన్‌ స‌డ‌లించ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ గాడిలో ప‌డుతోందని ఊహించ‌న‌ దాని కంటే వేగంగానే ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకుంటున్న‌ట్లు ఆర్‌బిఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మొత్తానికి జీడీపీ వృద్ధిరేటు -9.5 శాతంగా ఉండొచ్చ‌ని ఆర్‌బిఐ అంచ‌నా వేస్తోంది. 

అక్టోబర్ 2020 నాటికి భారత ప్రభుత్వానికి రూ.7,08,300 కోట్లు వచ్చాయని  ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 5,75,697 కోట్ల రూపాయల పన్ను ఆదాయం, 1,16,206 కోట్ల రూపాయల పన్నుయేతర ఆదాయం, రుణాలు రికవరీ (రూ .16,397 కోట్లు) ఉన్నాయి.