Asianet News TeluguAsianet News Telugu

దేశంలోనే టాప్ 10 ధనవంతుల్లో 6వ స్థానంలో నిలిచిన గౌతం అదానీ అన్నయ్య వినోద్ అదానీ..ఒక రోజు సంపాదన ఎంతంటే..

గౌతమ్ అదానీ ఇప్పుడు ప్రపంచంలోని 2వ అత్యంత సంపన్న వ్యక్తి.నిలవగా, తాజాగా ఆయన సోదరుడు కూడా భారతదేశంలోని టాప్ 10 ధనవంతులలో ఒకడిగా నిలిచారు.

Gautam Adani elder brother Vinod Adani who is ranked 6th among the top 10 richest people in the country
Author
First Published Sep 22, 2022, 3:13 PM IST

IIFL Wealth Hurun India Rich List 2022 బుధవారం విడుదల చేసిన టాప్ టెన్ ధనవంతుల జాబితాలో గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ శాంతిలాల్ అదానీ 6వ అత్యంత సంపన్న భారతీయుడిగా నిలిచారు. ఈ రోజు విడుదల చేసిన ‘IIFL Wealth Hurun India Rich List 2022 ప్రకారం, దుబాయ్‌లో నివసిస్తున్న వినోద్ శాంతిలాల్ అదానీ, ఏడాది కాలంలోనే 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నారు.

గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ ఆస్తి విలువ రూ.1.69 లక్షల కోట్లు గా ఉంది. గౌతమ్ అదానీ ఐదేళ్లలో తమ సంపదను 15.4 రెట్లు పెంచుకోగా, వినోద్ శాంతిలాల్ అదానీ తన సంపదను 9.5 రెట్లు పెంచుకున్నారని నివేదిక పేర్కొంది. గత 5 సంవత్సరాలలో, భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ర్యాంక్ 8వ స్థానం నుండి 1వ స్థానానికి చేరుకోగా, వినోద్ శాంతిలాల్ అదానీ ర్యాంకింగ్ 2018లో 49వ స్థానం నుంచి ఈ ఏడాది ఆరో స్థానానికి చేరుకుంది.

గత ఏడాది కాలంలో వినోద్ అదానీ నికర విలువ 28% లేదా రూ. 36,969 కోట్లు పెరిగింది. హురున్ నివేదిక ప్రకారం, వారు 2021 నుండి ప్రతిరోజూ రూ.102 కోట్ల కంటే ఎక్కువ సంపదను సృష్టించినట్లు తెలిసింది. అదానీ సోదరులిద్దరూ కలిసి రూ. 12,63,400 కోట్లు లేదా IIFL Wealth Hurun India Rich List  2022లోని టాప్ 10లో దాదాపు 40 శాతం సంపదను కలిగి ఉన్నట్లు తెలిసింది.  

అత్యంత ధనిక ఎన్నారైగా వినోద్ అదానీ..
అదానీ గ్రూప్‌కు చెందిన వినోద్ శాంతిలాల్ అదానీ అత్యంత ధనవంతులైన ఎన్నారైగా మొదటి స్థానంలో నిలిచారు. 1,103 మంది భారతీయ ఎన్నారైలలో, మొత్తం 94 మంది ఎన్నారైల నికర విలువ రూ.1,000 కోట్లుగా ఉంది. అదానీ గ్రూప్ కంపెనీల విలువ పెరగడంతో వినోద్ శాంతిలాల్ అదానీ ఆస్తుల విలువ కూడా పెరిగింది.

గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ అదానీని ఎక్కువగా వినోద్ భాయ్ అని కూడా పిలుస్తారు, ఆయన ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డారు.  అంతేకాదు సింగపూర్, ఇండోనేషియా రాజధాని జకార్తాలో వ్యాపార వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. 1976లో మహారాష్ట్రలోని ముంబైలోని భివాండిలో వి.ఆర్. టెక్స్ టైల్ పేరుతో పవర్ లూమ్స్ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తగా ఎదిగారు. తరువాత ఆయన కొత్త ఉత్పత్తులను పోర్ట్‌ఫోలియోకు పరిచయం చేశాడు. సింగపూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి విస్తరించాడు. తర్వాత వ్యాపార నిర్వహణ కోసం సింగపూర్ వెళ్లి 1994లో దుబాయ్‌లో స్థిరపడ్డారు. దీని ద్వారా మిడిల్ ఈస్ట్ అంతటా తన వ్యాపారాన్ని విస్తరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios